2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయానికి కారణమేంటనే ప్రశ్నకు చంద్రబాబు చేసిన తప్పులే కారణమని చాలామంది భావిస్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోకపోవడం, ప్రజలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం, అవినీతి ఆరోపణలు రావడం టీడీపీకి షాకింగ్ ఫలితాలు రావడానికి కారణమయ్యాయి.
చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న నేత అయినప్పటికీ అధికారంలో ఉన్న సమయంలో ఆ అనుభవం వల్ల పేదలకు ప్రయోజనం చేకూరేలా చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరోవైపు 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే నేతలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని జగన్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని జగన్ భావిస్తుండటం గమనార్హం.
అయితే జగన్ లా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం చంద్రబాబుకు చేత కావడం లేదు. తాను అభ్యర్థులను మార్చుతానని చంద్రబాబు చెబుతున్నా ఆయన మాటలను సొంత పార్టీ నేతలే నమ్మడం లేదు. ఈసారి టీడీపీలో టికెట్ల కోసం పెద్దగా పోటీ లేదని తెలుస్తోంది. టీడీపీ తరపున పోటీ చేయడం కంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం మంచిదని కొంతమంది అభ్యర్థులు భావిస్తున్నారు.
అభ్యర్థులలో నమ్మకం కలిగేలా చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు తడబడుతున్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు వేస్తే మాత్రమే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. చంద్రబాబు ఇప్పటినుంచి కష్టపడితే మాత్రమే 2024 ఎన్నికల్లో టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది.