TDP In Dilemma : తెలుగుదేశం పార్టీలో కలకలం రేపిన జనసేనాని

TDP In Dilemma

TDP In Dilemma : ఓట్లు చీలిపోనివ్వనంటున్నారు.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతారు. అసలేం జరుగుతోంది జనసేన పార్టీలో.! జనసేన పార్టీలో ఏం జరుగుతోందోగానీ, ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ వుంటారు.. జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ సహా అన్ని విపక్షాలూ మద్దతివ్వాలన్న జనసేనాని ఆలోచన చాలామంది రాజకీయ నాయకులకీ, రాజకీయ విశ్లేషకులకీ అర్థమవుతోంది.

‘పొత్తులపై చంద్రబాబుదే తుది నిర్ణయం.. విపక్షాలన్నీ ఒక్కతాటపైకొచ్చి జగన్ సర్కారుని దించాలన్న జనసేన ప్రతిపాదన ఆహ్వానించదగ్గదే..’ అని కొందరు టీడీపీ నాయకులు చెబుతున్నారు.

అయితే, 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేననీ, టీడీపీకి జనసేన మద్దతిస్తేనే బావుంటుందని సదరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ – బీజేపీ కలిసే పరిస్థితి లేదు, అలాగని రెండు పార్టీలూ కలవబోవని కూడా చెప్పడానికి వీల్లేని పరిస్థితి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అయితే, అధినాయకత్వం మీద తెలుగు తమ్ముళ్ళలో విశ్వాసం సన్నగిల్లిపోతున్నమాట వాస్తవం. ఆ కారణంగా కొందరు టీడీపీ నేతలు, జనసేన పార్టీ వైపు చూసే అవకాశం లేకపోలేదు.

నేరుగా జనసేనలోకి వెళ్ళకుండా బీజేపీలోకి ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు దూకేశారు. వాళ్ళలో కొందరు తాము పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయమై స్పష్టత తెచ్చుకునే పనిలో వున్నారు.

ఇంకొందరు టీడీపీ నేతలు, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.. టిక్కెట్లపై హామీ కోరుతున్నారట కూడా.

ఏదిఏమైనా, జనసేనాని చిన్నపాటి ప్రకంపనలైతే సృష్టించగలిగారు ఏపీ రాజకీయాల్లో.. అందునా తెలుగుదేశం పార్టీలో.!