ఎస్సీల్లో జగన్ కి తిరుగులేని ఆధిక్యత!

Centre for the Study of Developing Societies-Lokniti  నిర్వహించిన సర్వేలోని మరికొన్ని కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం . ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8 నియోజకవర్గాలలో కొన్ని సాంపిల్స్ సేకరించి వాటిని కులాలు వారిగా విశ్లేషించారు.ఆంధ్రా జనాభాలో సుమారు 17శాతం వున్న మాల మాదిగల అభిప్రయం ఎలావుందో తెలుసుకోవడం జరిగింది.  అందులోని కొన్ని ఆసక్తికర విషయాలు …

మాలలు జగన్ కి దున్నుగా నిలబడ్డారు ఎంతగా అంటే మిగతా అన్ని పార్టీలకి లభించిన మద్దతు కంటే జగన్ వైపే ఎక్కువమంది మొగ్గు చూపారు. 65 శాతంమంది మాలలు వైస్సార్సీపీ కి మద్దతు తెలపగా మిగతా 35 శాతంలో అత్యధికులు కాంగ్రెస్ కి మద్దతు పలికారు. అధికార తెలుగుదేశం పార్టీకి మూడవ స్థానం లభించింది. మాదిగల్లో 50 శాతం మంది వైస్సార్సీపీకి మద్దతు పలకగా మిగతా 50 శాతంలో అత్యధికులు కాంగ్రెస్ కి మద్దతు తెలపగా ఇక్కడ కూడా టీడీపీకి మూడవ స్థానం లభించింది.

గిరిజనుల్లో (ST ) అత్యధికులు ఇంకా కాంగ్రెస్ వైపు ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ వైస్సార్సీపీ రెండు మరియు మూడవ స్థానాల్లో నిలిచాయి.

మొత్తంగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో వైస్సార్సీపీకి 52 శాతం మద్దతు లభించగా మిగతా 48 శాతం మంది టీడీపీ కాంగ్రెస్ మరియి బీజేపీ ఇతర పక్షాలకు మద్దతు తెలిపారు . ఇది వైస్సార్సీపీకి సంతోషం కలింగించే వార్తే అయినప్పటికీ వాళ్ళకి ఆందోళన కలిగించే అంశం ఏదైనా ఉందంటే అది కాంగ్రెసుకి  మద్దతు పెరగడం. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుండి పుట్టిన పార్టీ వైస్సార్సీపీ. కాంగ్రెస్ కి మద్దతు పెరిగితే అది ఎంతో కొంత వైస్సార్సీపీ ఓటు బ్యాంకుకి గండి కొడుతుంది .

ఇంకో ముఖ్యమైన అంశం ఎంటటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ కాంగ్రెస్ కి రెండు  శాతం మేర మద్దతు పెరిగినా అది వైస్సార్సీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. రెండు శాతం ఓట్లు ఏమి చెయ్యగలవో రాజకీయంగా ఎంత ప్రభావం చూపించగలవో వైస్సార్సీపీకి కంటే బాగా తెలిసినవారెవ్వరు వుండరు కనుక.

 

రెడ్లలో జగన్ బలం కమ్మలలో చంద్రబాబు బలం కంటే తక్కువ?