తెలంగాణలో లాగా ఆంధ్రలో కూడా రెడ్లు గళమెత్తుతున్నారు. రెడ్లకు అన్యాయం జరగుతుూ ఉందని, రెడ్లలో ఉన్న పేద వారు అన్యాయానికి గురువుతున్నారని రెడ్ల నాయకులంటున్నారు.
ఈ విషయం మీద తెలంగాణ పెద్ద చర్చ జరగుతుూ ఉంటుంది. ఏ కులంలోనైనా తెలంగాణ వాళు ఆంధ్రోళ్ల కంటే ఒకడుగు ముందుంటారు. రెడ్ల కు సామాజిక న్యాయం కావాలంటూ తెలంగాణ నేతలు చాల ా సంవత్సరాలుగా గర్జన సభలునిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన వారు ఒక సారి హైదరాబాద్ రవీంద్ర భారతలో కలిశారు. మొన్నామధ్య వరంగల్ లో కలిశారు. అనేక రెడ్ల యువజన సంఘాలు ఏర్పడ్డాయి. చివరకు ఇది వరంగల్ సభలో రిజర్వేషన్లు కావాలనే దాకా వెళ్లింది. జాట్ తరహా ఉద్యమం నడిపాల్సిందేనని యువకులు నినాదిలిచ్చారు.
ఇది ఆంధ్రలో కూడా రాజుకుంటున్నదేందుకు నెల్లూరు లో జరిగిన సదస్సు ఒక సాక్ష్యం. నెల్లూరు రెడ్డి సంక్షేమ సంఘం ఒక కొత్త డిమాండ్ తీసుకువచ్చింది.
రెడ్డి కులంలో కూడా పేదవారు ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రెడ్డి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ మీద రెడ్ల ను సమీకరించేందుకు నెల్లూరు జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో రెడ్డి కార్యకర్తల సమావేశం జరిపింది. ఈ సమావేశానికి పలువురు రెడ్డి సంఘ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. అన్ని కులాలలో కూడా పేదవారు ఉన్నారని అలాగే రెడ్డి (కాపు) కులంలో కూడా పేదలున్నారన్న విషయం గుర్తించాలన్నది సమావేశం ప్రధాని విజ్ఞప్తి. రెడ్లంతా ఉన్నతులే అని భావించడం సరైనది కాదని సమావేశానికి వచ్చిన వారు అన్నారు.
రెడ్డి కులంలో కూడా తినడానికి తిండి లేని వారు ఉన్నారు. వారిని ప్రభుత్వమే ఆదుకోనకపోతె ఎలా? రిజర్వేషన్ల పేరుతో రెడ్డి కులస్థులు అన్ని అవకాశాలు కోల్పోతున్నారని ఏదైనా మెరిట్ ప్రకారమే చేయాలన్నారు. ఇతర కులస్థుల రిజర్వేషన్లకు తాము అడ్డుకామని , మాలో ఉన్న పేదవారికి కూడా వారిలాగా రిజర్వేషన్లు వర్తింపజేయాలి, అనేది వారు డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించాలని నాయకులు కోరారు. ఈ సమావేశంలో మరికొన్ని డిమాండ్స్ వారు ప్రభుత్వాల ముందు ఉంచారు. అవి…
1.ఒకటో తరగతి నుంచి పీజీ వరకు కులాలతో సంబంధం లేకుండా అందరికి ఉచిత విద్యనందిచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
2. రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో కులాలతో సంబంధం లేకుండా అందరికి మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
3. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు తీసివేసి మెరిట్ ప్రకారమే నియమాకాలు జరపాలని, అలాగే వయసు నిబంధనను సడలించి 45 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
4. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్ల ద్వారా కాకుండా సీనియారిటి ప్రాతిపదికన ఇవ్వాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
5. వ్యవసాయ పనిముట్లకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కులాలతో సంబంధం లేకుండా అందరికీ 70% ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
6. ఉపాధి హామీ పథకానికి 5 ఎకరాలకంటే ఎక్కువ ఉన్న వారు అనర్హులు అనే నిబంధనను తీసివేయాలి.
7. గృహ సంబంధంగా వాడే విద్యుత్ లో 100 యూనిట్ల లోపు వాడిన వారందరికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి.
8. జలసిరి ద్వారా ప్రభుత్వం ఇచ్చే పంపుసెట్లలో అందరికీ వంద శాతం సబ్సిడి ఇవ్వాలి.
9. కర్నాటక తరహాలో యోగి వేమన జయంతి రోజున సెలవు ప్రకటించి, ఆ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.
10. కర్నూలులో నిర్మిస్తున్న విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలి.
11. అమరావతిలో రెడ్డి సంక్షేమ సంఘానికి భూమిని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలి.
12. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరికి కులాలతో సంబంధం లేకుండా సమాన లోన్లు ఇవ్వాలి.
13. రెడ్డి కులస్థులకు జాతీయ స్థాయిలో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రెడ్డిలందరికి విద్య, ఉపాధి, రైతులకు సహాయం చేయాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
రెడ్డి కులస్థుల్లో చాలా మంది వెనుకబడి ఉన్నారని, పేరే పెద్దగా ఉందని బతకటం కూడా కష్టమయ్యే స్థితిలో చాలామంది రెడ్డి కులస్థులు బతుకులు వెళ్లదీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేద రెడ్డిలకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించాలని రిజర్వేషన్ల వల్ల అర్హులకు అన్యాయమైపోతుదన్నారు. ప్రభుత్వాలు స్పందించకుంటే ఉద్యమించి రెడ్డిల తడాఖా చూపుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వినీత్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మదన్ కుమార్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.