ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. మా పాప ఢిల్లీలో చదువుకుంటోందని మీ రాజధాని ఏదీ అంటూ మా పాపను ఆట పట్టిస్తున్నారని జస్టిస్ దేవానంద్ చెప్పుకొచ్చారు. అయితే రాజధాని విషయంలో చాలామంది జగన్ ను నిందిస్తున్నా ఇందులో జగన్ తప్పు ఎంత ఉందో చంద్రబాబు చేసిన తప్పు అంతే ఉంది.
మూడు పంటలు పండే పొలాలు ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలియనిది కాదు. రాజధానికి చుట్టూ పక్కల ఉన్న గ్రామాలన్నీ వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాలు కావడం గమనార్హం. అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే అక్కడ భూముల విలువ ఊహించని స్థాయిలో పెరిగిపోయి సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు సెంటు భూమి కొనుగోలు చేయాలన్నా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది.
అమరావతి కాకుండా విశాఖను రాజధానిగా కావడం వల్ల వేగంగా అభివృద్ధి జరిగే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని జిల్లాల ప్రజలకు విశాఖ దూరమైనా సాఫ్ట్ వేర్ కంపెనీలకు, ఇండస్ట్రీలకు విశాఖలో అనుకూల వాతావరణం ఉంది. విశాఖ నుంచి జగన్ పాలన సాగించడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు మద్దతు ఇచ్చి ఉంటే ఇప్పటికే విశాఖ నుంచి పాలన మొదలై ఉండేది. అమరావతి రైతుల పాదయాత్ర వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు.
అసలు అమరావతి కోసం యాత్ర చేస్తున్న వాళ్లలో రైతులే లేరనేది బహిరంగ సత్యం. లేని సమస్యను సృష్టించి చంద్రబాబు ప్రజలను ఇబ్బంది పెడుతున్నరనే వాస్తవం ఇప్పటికీ చాలామందికి అర్థం కావడం లేదు. చంద్రబాబు పొలిటికల్ ప్లాన్స్ వల్ల నష్టపోతున్నది ఏపీ ప్రజలేనని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబు లేదా జగన్ లలో ఎవరో ఒకరికి షాక్ తగిలే ఛాన్స్ అయితే ఉంది.