కుమారస్వామి ప్రభుత్వం కూలిపోడానికి బీజేపీ యే కారణమా ?
14 నెలల పాటు కాపాడుకుంటూ వస్తున్న కుమార స్వామి సంకీర్ణ సర్కారు మంగళవారం నాడు కర్ణాటక అసెంబ్లీ జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోయింది . కేవలం ఆరు ఓట్ల తేడాతో కాంగ్రెస్ , జనతా దళ్ ప్రభుత్వం పడిపోయింది . ముఖ్యమంత్రి కుమారస్వామి తన ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గుతుందనే ఆశాభావంతో వున్నారు . రాజీనామా చేసిన వారు తనకు మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం . కానీ ఆ విశ్వాసం , నమ్మకం వమ్మై పోయింది . అసెంబ్లీ లో గత నాలుగు రోజులుగా కర్ణాటక సర్కారును ఎలాగైనా పడగొట్టాలల్ని భారతీయ జనతా పార్టీ పావులు కడుపుతూనే వుంది . అమిత్ షా నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు మురళీధర్ బెంగళూరు లోనే మకాం వేసి విజయవంతంగా కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టారు . దీంతో ముఖ్యమంత్రి కుమారస్వామి శాసన సభలోనే కుప్పకూలిపోయాడు .
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో వున్న విషయాన్ని దేశమంతా గమనిస్తూనే వుంది . గత సంవత్సరం కర్ణాటక శాసన సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 104 స్థానాలను సంపాదించింది . కాంగ్రెస్ పార్టీకి 78 స్థానాలు జనతాదళ్ కు 37 స్థానాలు వచ్చాయి . భారతీయ జనతా పార్టీ మే 17న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . అయితే కాంగ్రెస్ పార్టీ , జనతా దళ్ ఈ విషయంలో ఆందోళనకు దిగాయి . బీజేపీ 19న దిగి వచ్చింది . ప్రభుత్వం నుంచి వైతొలగింది . అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలనుకున్నా కుమారా స్వామి తాను ముఖ్య మంత్రి అయితేనే పొత్తుకు అంగీకరిస్తామని చెప్పాడు . దీంతో గత్యంతరం లేని స్థితిలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఒప్పుకుంది . మే 23న కుమారస్వామి ముఖ్యమంత్రిగా కర్ణాటకలో సర్కార్ ఏర్పడింది . ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ , జనతాదళ్ మధ్య పోతుల మధ్య అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి . ఒకరి పై మరొకరికి నమ్మకం సడలిపోసాగింది . రెండు పార్టీలు విమర్శలతో రోడ్డెక్కాయి .
దీన్ని భారతీయ జనతా పార్టీ అవకాశంగా తీసుకొని పావులు కదపడం మొదలు పెట్టింది . రెండు పార్టీల్లో వున్న నేతల్లో అసంతృప్తులను గుర్తించి రాజీనామాకు తెర తీశారు .. ఇక అక్కడ నుంచి రాజకీయం తారాస్థాయికి చేరింది . కుమార స్వామి ప్రభుత్వం సభలో విశ్వాస పరీక్షలో పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తీసుకు రావడం మొదలు పెట్టింది . కుమార స్వామి దీనికి తల వంచక తప్పలేదు . శాసన సభాపతి రమేష్ కుమార్ మంగళవారం రాత్రి 7. 19 నిముషాలకు విశ్వాస పరీక్ష నిర్వహించారు . సభకు 204 మంది సభ్యులు హాజరయ్యారు . ఇందులో కుమార స్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు రాగా వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి . దీంతో సభలో కుమార స్వామి ప్రభుత్వం పడిపోయినట్టు సభాపతి రమేష్ కుమార్ ప్రకటించారు . కుమార స్వామి సభలోనే కుప్పకూలిపోయాడు . తరువాత తన రాజీనామాను గవర్నర్ వాజు బాయ్ వాలాకు సమర్పించారు .
<
p style=”text-align: justify”>
దీంతో భారతీయ జనతా పార్టీ కి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మార్గం సుగమం అయ్యింది . మాజీ ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టే అవకాశం వుంది . భారతీయ జనతా పార్టీ పకడ్బందిగా ఆపరేషన్ పూర్తి చేసింది .