రజనీకాంత్ రాజకీయ వ్యూహం పై విమర్శలు
తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి . ప్రస్తుతం అక్కడ అన్నా డీఎంకే , డీఎంకే , కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ తమ భవిష్యత్తు కోసం అనేక ఎత్తులు వేస్తున్నాయి . అయితే ప్రస్తుతం అక్కడ డీఎంకే పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు . జయలలిత మరణం తరువాత అన్నా డీఎంకే రెండు ముక్కలైంది . మళ్ళీ శశికళ దెబ్బతో రెండు కలసి పోయాయి . వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తమిళనాడులో తమ ప్రాబల్యం పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది . ఆ రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టికూడా పెట్టింది .
తమిళ నాడులో రజనీకాంత్ , కమలహాసన్ ఇద్దరు మాస్ ఫాలోయింగ్ వున్న అగ్ర నటులు. జయలలిత చనిపోయిన తరువాత ఇద్దరి ద్రుష్టి రాజకీయ రంగంపై పడింది . స్వంతగా పార్టీని ప్రారంభిస్తే తామే కాబోయే ముఖ్యమంత్రని కలలు కన్నారు . రాజకీయ పార్టీలను కూడా ప్రకటించారు . కమల్ హాసన్ పార్టీ కండువాను భుజం మీదా వేసుకొని తమిళ నాట తిరిగాడు . ఎదో ఆయన అభిమానుల్లో తప్ప ప్రజల్లో పెద్దగా స్పందన రాలేదు .
ఇక రజనీకాంత్ 2017 డిసెంబర్ 31న రాజకీయ పార్టీని గ్రాండ్ గా ప్రకటించాడు . అయితే ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు . సినిమాలు చేసుకుంటున్నాడు . అయితే ఈ మధ్య భారతీయ జనతా పార్టీకి చేరువవుతున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి . కారణం చాలా కాలం నుంచి రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితంగా ఉంటున్నాడు . రజనీ తన పార్టీతో కలసి భారతీయ జనతా పార్టీలో చేరిపోతాడని అనుకుంటున్నారు . కారణం తాను స్వంతంగా పోటీ చేస్తే సీట్లు వస్తాయనే నమ్మకం రజనీలో లేదు . అందుకే ఆయన చూపు భారతీయ జనతా పార్టీ వైపు మళ్లుతుందట .
నిజానికి కమల్ హాసన్ , రజనీ ఇద్దరు సమకాలీకులు , అయితే రాజకీయం వారి మధ్య స్పర్ధలు కలిపించింది . విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోసాగారు . రజనీ తమిళుడు కాదనే వాదన కమల్ తెర మీదకు తెచ్చాడు .. అయితే ఇటీవల కమల్ రజనీతో కలసి ఎన్నికల్లో పోటీచేస్తాని ప్రకటించాడు . కానీ రజనీ దీనికి స్పందించలేదు . ఇలావుండగా ఇప్పుడు రజనీకాంత్ నరేంద్ర మోడీ , అమిత్ షా భజన మొదలు పెట్టాడు . వారిద్దరినీ కృష్ణార్జునులని అభివర్ణించాడు . ఆర్టికల్ 370 రద్దును రజనీకాంత్ సమర్ధించాడు . తమిళనాట భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదు . అందుకే రజనీ కాంత్ తో కలసి ఎన్నికకు వెడదామని మోడీ , అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు . ఇది తెలిసి తమిళ రాజకీయ పార్టీలు రజనీని విమర్శించడం మొదలు పెట్టాయి . మరి రజనీ వ్యూహమేమిటో తెలియడం లేదు .