అడ్డం తిరిగిన కేసిఆర్ వీరాభిమానం

తెలంగాణలో కేసిఆర్ వీరాభిమానుల సంఖ్య లెక్కలేనంతగా ఉంటది. కేసిఆర్ అభిమానులు రకరకాలుగా ఉంటారు. అందులో కొందరు వీర భక్తులు ఉండగా మరికొందరు తమ శక్తిమేరకు అభిమానం చూపుతారు. కేసిఆర్ ను అభిమానించడంలో వీరాది వీరుడు, గ్రేటాది గ్రేటుడు అనిపించుకున్నాడు సందీప్ ఠాగూర్. ఈ సందీప్ ఠాగూర్ బరిలోకి దిగితే అవతలివారు వెనకడుగు వేయాల్సిందే అన్నంతగా అతడి దాడి ఉంటుండేది. రాజకీయ నాయకులైనా, మీడియా ప్రతినిధులైనా ఎవరైనా సరే కేసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడినా, వార్తలు రాసినా సందీప్ ఠాగూర్ ఎంట్రీ ఇచ్చేవాడు. బూతు పదాలతో, గలీజు తిట్లతో కేసిఆర్ ప్రత్యర్థుల మీద విరుచుకుపడేవాడు. అదంతా గతం. ఇప్పుడు సందీప్ ఠాగూర్ ప్లేట్ ఫిరాయించాడు. కేసిఆర్ వీరాభిమాని కాస్తా కేసిఆర్ పై విమర్శల పర్వానికి తెర తీశాడు. సందీప్ ఠాగూర్ స్టోరీ చదవండి.

సందీప్ ఠాగూర్ కేసిఆర్ వీరాభిమాని. కేసిఆర్ ను ఎవరు విమర్శించినా సందీప్ ఠాగూర్ ఫేస్ బుక్ లో వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. ఎపి సిఎం చంద్రబాబు మొదలుకొని రేవంత్ రెడ్డి, బిజెపి కిషన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, కోదండరాం లాంటి వాళ్లందరి మీద బూతులు, తిట్లతో పోస్టులు పెట్టాడు సందీప్. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు సందీప్ దాడి కొనసాగింది. అయితే మూడు నెలల క్రితం సందీప్ పెట్టిన పోస్టు కేసిఆర్ అభిమానుల ఒల్లు గగుర్పొడిచేలా ఉంది. ఇది నా మరణ వాంగ్మూలం అంటూ సందీప్ ఒక పోస్టు పెట్టి ఫేస్ బుక్ నుంచి మాయమైపోయాడు. దాంట్లో ఏమన్నాడంటే..? కేసిఆర్ దగ్గర పనిచేసే శేరి సుభాష్ రెడ్డి కొణతం దిలీప్ కుమార్ లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, వారు కేసిఆర్ ను గబ్బు లేపుతున్నారని విమర్శించాడు. కేసిఆర్ అభిమానులు ఎవరైనా కేసిఆర్ ను కలవాలంటే ముందుగా శేరి సుభాష్ రెడ్డిని, కొణతం దిలీప్ ను ప్రసన్నం చేసుకోవాలని, అలా చేసుకోకపోతే కేసిఆర్ తో ఫొటో దిగే చాన్స్ కూడా ఉండదని పేర్కొన్నాడు. వారి వైఖరి కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్లు చెబుతున్నారు.

ఇక మూడు నెలల తర్వాత సందీప్ ఠాగూర్ మళ్లీ ఫేస్ బుక్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈసారి కేసిఆర్ ను టార్గెట్ చేస్తూ పోస్టు విడుదల చేశాడు. ఇంటికో ఉద్యోగం  ఇస్తానని కేసిఆర్ అనలేదంటూ ఇంతకాలం టిఆర్ఎస్ నేతలు అదరగొడుతూ వచ్చారు. కానీ ఒకానొక సందర్భంలో కేసిఆర్ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందన్న వీడియో క్లిప్ ను సందీప్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు. మొత్తానికి కేసిఆర్ వీరాభిమానిగా వెలుగొందిన సందీప్ అనతికాలంలోనే అడ్డం తిరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సందీప్ పెట్టిన పోస్టు లింక్ ికింద ఉంది చూడొచ్చు.

తాజాగా సందీప్ ఠాగూర్  పెట్టిన పోస్టు