వైసీపీ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా సరే కొన్ని ఇబ్బందులు మాత్రం బాగానే వెంటాడుతున్నాయి. రాజకీయంగా సీఎం జగన్ ని కొంత మంది ఇబ్బంది పెడుతున్నారు అనే వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటూనే ఉన్నాం. ఇక వైసీపీ నేతలు కోర్ట్ లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో సంచలనం గా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది అని వార్తలు వస్తున్న సరే కొంత మంది వైసీపీ నేతలు మాత్రం పదే పదే న్యాయస్థానాలను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి అనే మాట అక్షరాలా నిజం.
ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఏకంగా రాజ్యాంగ వ్యవస్థలను విమర్శిస్తూ వారధిపై ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం . కోర్టు ల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి.
కానీ వైసిపి నేతలు మాత్రం పదే పదే న్యాయస్థానాలను ఉద్దేశించి విమర్శిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు ఏదైనా చర్య ప్రకటిస్తే అనవసరంగా జగన్ ఇబ్బంది పడతారు. కాబట్టి వైసీపీ నేతలు సైలెంట్ గా ఉండటం మంచిది అని అంటున్నారు. భావోద్వేగాలను రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది కానీ న్యాయ స్థానాలపై చేసిన విమర్శల విషయంలో మాత్రం లేకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.