ఈ పథకంతో జగన్మోహన్ రెడ్డి కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది: కొడాలి నాని

Jagan Mohan Reddy launched distribution of house sites to homeless poor

కృష్ణా జిల్లా : గుడివాడ పట్టణ పరిధిలోగల మల్లాయిపాలెంలో ఇళ్లస్థలాలు మంజూరు అయిన లబ్దిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్డీవో శ్రీనుకుమార్, ఇతర అధికారలుతో కలసి రాష్ట్ర పౌరసరఫరాలు,వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి నాని శుక్రవారం పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగామంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలకు పరమ పవిత్రమమైన శుక్రవారం రోజున పేదలకు ఇల్ల స్థల పట్టాలను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలకు 66 వేల ఎకరాల్లో 30 లక్షల మంది అర్హులైన లబ్దిదారులకు ఇళ్లును అందించిన ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఘనత చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు.

Jagan Mohan Reddy launched distribution of house sites to homeless poor
Jagan Mohan Reddy launched distribution of house sites to homeless poor

పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, కురాన్, భగవద్గీతతో సమానంగా ఇచ్చిన వాగ్దానాలను క్యాలెండరు వారీ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోటి 50 లక్షల కుటుంబాలు ఉంటే అందులో 20 శాతం కుటుంబాలయిన 30 లక్షలమందికి ఇళ్ల స్థలాను అందిస్తున్నారు.మొదటి సంవత్సరంలో 14 లక్షల 80 వేల మందికి ఇళ్లును నిర్మించి, రెండవ సంవత్సరం పూర్తి స్థాయిలో అన్ని ఇళ్ల నిర్మిస్తామన్నారు.ఇళ్ల స్థలం మంజూరయిన ప్రతి లబ్దిదారునికి 1 లక్షా 80 వేల రూపాయలతో ప్రభుత్వమే ఇంటిని నిర్మిస్తుందన్నారు. తొలి దశలో 5200 మందికి ఇళ్లు నిర్మించేందుకు సిద్దంగా వున్నామన్నారు. ఎకరం 52 లక్షలు చొప్పున 92 కోట్ల రూపాయలతో 181 ఎకరాలను కొనుగోలు7 వేల మందికి ఇళ్ల స్థల పట్టాలను అందిస్తున్నామన్నారు.

భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ సభ్యునికి అపాయింట్ మెంట్ ఇవ్వరన్నారు. అటువంటిది 2008 వ సంవత్సరం ఏప్రిల్ 20 వ తేదీన ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న నేను హైదరాబాదు పాదయాత్రద్వారా వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి ఈ ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాల కొరకు అభ్యర్థించగా ఆయన వెంటనే స్పందిస్తూ స్థలాన్ని అందించారన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీగా సుందరంగా రూపు దిద్దుకొనే ఈ కాలనీలో ఎన్ఆరాఇజిఎస్ ద్వారా 12 కోట్లతో రహదార్లు అభివృద్ది, మరో 70 కోట్లు వ్యయతో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయలకు టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించామన్నారు. రానున్న మే నెలకు కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని మంత్రి కొడాని నాని చెప్పారు.

టిడ్కో నిర్మించిన ఏ,బి,సి బ్లాక్ ల ఇళ్లును లబ్దిదారులకు లాటరీ పద్దతిలో కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 300 చ.గ. ఇల్లు కు 1 రూపాయి మాత్రమే తీసుకొని ఇంటిని అందిస్తున్నారు.360 చ.గం. రూ 50 వేలు, 460 చ.గ. లక్షల రూపాయలు గత ప్రభత్వంలో లబ్దిదారులు చెల్లించారని, లబ్దిదారుల పై భారం పడకుండా రూ. 50 వేలు కట్టిన వారికి, రూ. 25 వేలు చొప్పున రూ.లక్ష రూపాలు కట్టిన వారికి రూ. 50 వేలుచొప్పున తగ్గించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు.దీనివలన ప్రభత్వం పై రూ. 482 కోట్లు భారం పడుతుందన్నారు.లబ్దిదారులకు 22/21 చ.గ. గృహనిర్మాణ సంస్థ ఇంటినిర్మిస్తుందన్నారు. ఇసుక, సిమ్మెంట్, ఐరన్, తలుపులు, ఇతర సామాగ్రి అంతా ప్రభుత్వమే అందిస్తుందన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఎకరం స్థలంలో దివంగత మఖ్యమంత్రి డా. రాజశేఖరరెడ్డి 50 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు.

కాలనీ అభివృద్దికి తండ్రి వైఎస్ఆర్, తనయుడు జగన్మోహన్ రెడ్డి కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుదన్నారు. అదేవిధంగా గుడివాడ పట్టణంలో రూ. 10కోట్ల 70 లక్షలతో ఆసుపత్రి, భవన నిర్మాణం, రూ.22 కోట్లతో బస్సాండ్ అభివృద్దితో పాటు మరో 630 కోట్లతో నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని మంత్రి కొడాలి తెలిపారు.ఈ సందర్బంగా ఇళ్ళస్థల పట్టాలను, టిడ్కోఇళ్లు పట్టాలను లబ్దిదారులకు అందజేసారు. అనంతరం వంగపండు మంగమ్మకు మంజూరు అయిన ఇంటిస్థలంలో మంత్రి భూమి పూజ చేసారు.