2019 ఎన్నికల్లో రాష్ర్టమంతా వైసీపీ వేవ్ లోనే కొట్టకొచ్చేసింది. టీడీపీ గెలిచిన 23 సీట్లు కూడా కేవలం ఆ పార్టీ కీలక నేతలవి మాత్రమే. కొన్ని దశాబ్ధాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాలు కావడంతో సైకిల్ పార్టీ ఆ 23 ఇంటిని దక్కించుకుంది. మొత్తంగా 2019 ఎన్నికలు చూసుకుంటే జగన్ కి అతను బరిలోకి దింపిన క్యాండెట్లకు కుల, మత, ప్రాంతం అనే బేధాలు లేకుండా గుద్దేసారు! అన్నది పక్కాగా తెలిసిన వాస్తవం. వైఎస్సార్ మీద అభిమానమా? జగన్ పై ఉన్న సానుభూతా? కొత్త లీడర్ ని చూద్దామా? అన్న ఆరాటమా? అన్నది పక్కనబెడితే! వైసీపీ ప్రభంజనం అనేది దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేది.
అయితే జగన్ గద్దెనకెక్కిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ ప్రపోజల్ ని తీసుకురావడంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యతిరేకి అయ్యారు. ఆ మూడు జిల్లాల వాసులు అతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అన్నది వాస్తవం. ఆ మూడు జిల్లాలు కూడా కమ్మ సామాజిక వర్గాని చెందినవి. కొన్ని దశాభ్దాలుగా అక్కడ రాజకీయం అనేది ఆ వర్గం చేతిలోనే లాక్ అయి ఉంది. కమ్మ వర్గానికి అక్కడా కాస్తో..కూస్తో పోటీనిచ్చేది కాపు సామాజిక వర్గం. అయితే దివంగత నేత ఎన్టీఆర్ వేసిన విత్తనం అక్కడ పెద్ద పెద్ద చెట్లుగా మారి బలంగా పాతుకుపోయి ఉన్నాయి. `కాపు` కన్నా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే బలంగా ఉన్నారు.
ఈనేపథ్యంలో భవిష్యత్ రాజకీయం కోసం..ప్రస్తుతం వస్తోన్న వ్యతిరేకతను తిప్పికొట్టాలంటే జగన్ ఇప్పుడు అక్కడ అదే సామాజి వర్గానికి చెందిన నేతల్ని రంగంలోకి దించాలి. సరిగ్గా అదే వ్యూహంతో క్యాడర్ పావులు కదుపుతోంది. ఎన్నికల్లో సీట్లు..ఆపై పదువులు వస్తాయని ఆశించి విఫలమైన కమ్మ సామాజిక వర్గం నేతల్ని జగన్ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్ తో పాటు, విజయవాడ తూర్పు ఇన్ ఛార్జ్ అవినాష్ టీడీపీ కమ్మనేతలపై బాణాల్లా వదలడానికి రంగం సిద్దం చేస్తున్నా రుట. అవినాష్ కి విజయవాడ నగరంలో పార్టీ పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నారుట. అలాగే ఎమ్మెల్సీ, ఆపై మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన మర్రి రాజశేఖర్ కు గుంటూరు ప్రాంతీయాభివృద్ధి మండలి చైర్మన్‌తో పాటు కేబినెట్ హోదా కల్పించాలని జగన్ ఆలోచన చేస్తున్నారుట.