తిరుమల అలిపిరి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య దర్శనాలు నిలిపివేసింది టీటీడీ. అయితే ముందస్తు సమాచారం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులు సమయం ఉన్నా అధికారులు ముందు నుంచే అనుమతించడం లేదు.
ఈ క్రమంలో దర్శనానికి టోకన్లు జారీ చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. 24వ తేది దర్శన టికెట్లు కలిగిన భక్తులును తిరుమలకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీటీడీ మాత్రం కోవిడ్ నిభందనలు కారణంగా దర్శనానికి ముందు రోజు మాత్రమే అనుమతిస్తామని చెబుతోంది.
ఇప్పటికే ఆన్ లైన్, ఆఫ్ లైన్లో 24వ తేది వరకు దర్శన టోకేన్లు జారి చేసింది టీటీడీ. అయితే తమను ఎలా అయినా దర్శనాలు చేయించే పంపాలని పట్టు పట్టి అక్కడే రోడ్డు మీద కూర్చున్నారు భక్తులు దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫ్ఫిక్ జామ్ కూడా అయింది.