Sampradayini Suppini Suddapoosani: వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ హీరో శివాజీ, హీరోయిన్ లయ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వం వహించారు. 90’s వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్ తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న డైరెక్ట్ ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్ కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ డేట్ & సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా కథ విన్న వెంటనే నచ్చింది. ఈటీవీ విన్ వాళ్ళకి పంపించాను. ఈ ప్రాజెక్టు నాకు అప్పచెప్పారు. ఈటీవీతో నాకు ఎంతో మంచి అనుబంధంగా ఉంది. నేను మళ్ళీ ఈ రోజు మీ ముందు కనిపించడానికి కారణం బాపినీడి గారు. ఆయన ప్రోత్సాహంతోనే 90’s వెబ్ సిరీస్ చేశాను. నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఈటీవీ నాకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. సుధీర్ కొత్త దర్శకుడు అయినప్పటికీ కథను చాలా అద్భుతంగా చెప్పా.డు తను చెప్పిన కథను అద్భుతంగా తీస్తాడని నమ్మకం కూడా ఉంది. సుధీర్ కి నచ్చిన టీం తోనే ఈ సినిమా చేసాం. ఈ సినిమాలో చాలా పాపులర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా కూర్చుని ఒక సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. ఈ సాంగ్ 20 సంవత్సరాలు క్రితం విన్నది.

వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకుని కంపోజిషన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ చాలా పాషన్ తో పనిచేశారు. ప్రిన్స్ బెస్ట్ యాక్టర్. ఈ సినిమా ద్వారా తను ఇంకో రకమైన షేడ్ లో చూస్తారా. అలాగే రఘుబాబు గారు ఆలీ గారు పృథ్వి గారు చమ్మక్ చంద్ర చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. లయ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా అద్భుతంగా సపోర్ట్ చేసింది. మంచి హిట్ సినిమా అవ్వాలని చాలా కష్టపడింది. బండ్ల గణేష్ నా బ్రదర్ లాంటివారు. ఆయన పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది. ఈ సినిమాలో మంచి సాంగ్ చేశారు. అది చాలా హెల్ప్ అయ్యింది. రంజిన్ రాజ్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. రోహన్ గాడ్ గిఫ్ట్ యాక్టర్. తను ఎన్నో ఏళ్ళు సినిమాలు చేయాలని నా కోరిక. అరకు, కొండవీడు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం అక్కడ పోలీసులు ఎంతో సహకరించారు. చాలా మంచి ప్రోడక్ట్ వచ్చింది. 90స్ లో ఒక స్టార్ట్ అయింది. ఈ సినిమాతో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఈటీవీ ప్యూర్ తెలుగు ప్లాట్ ఫామ్. ఎంతోమంది టెక్నీషియన్స్ కి ఆర్టిస్టులకి పెద్ద బూస్ట్. అందరూ కూడా ఈటీవీ విని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక మంచి కంటెంట్ 12 తారీకున మీ ముందుకు రాబోతోంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యు. అలాగే దండోరాని హిట్ చేసిన అందరికీ థాంక్స్. ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.
హీరోయిన్ లయ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మిస్సమ్మ అదిరిందయ్యా చంద్రం టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేశాం. మిస్సమ్మ అందరూ చాలా బాగా కనెక్ట్ అయ్యారు రత్నమాలని గుర్తు పెట్టుకున్నారు. ఇక నుంచి ఉత్తరని గుర్తు పెట్టుకుంటారు. ఈ కథ విన్నపట్టుకునే చాలా నచ్చింది. ఉత్తర నా కెరియర్ లో చాలా స్పెషల్ క్యారెక్టర్ అవుతుంది. నటీనటులకు టెక్నీషియన్స్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈటీవీలో 90s చేయాల్సింది. మిస్సయ్యాను. ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. శివాజీ గారికి సినిమా అంటే చాలా పాషన్ ఈ సినిమా కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ చేశా.రు ఆయన వరుస విజయాలతో ఉన్నారు. ఫిబ్రవరి 12న ఈటీవీలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది మీ అందరికీ నచ్చుతుంది.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది చాలా మంచి క్రైమ్ కామెడీ. చాలా రోజుల తర్వాత ఈ జానర్ లో సినిమా వస్తోంది. అలాగే మోస్ట్ అవైటెడ్ పెయిర్ శివాజీ గారు లయ గారు కలిసి నటించిన సినిమా. శివాజీ గారు చాలా రోజుల తర్వాత 90 చేశారు. అది చాలా పెద్ద హిట్ అయింది. చాలా రోజుల తర్వాత ప్రొడక్షన్ లో సినిమా చేశారు. ఈటీవీ విన్ తో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 12వ ఈ సినిమా ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతుంది. మా గత సినిమాలు ఎలా అయితే మిమ్మల్ని అలరించాయో ఈ సినిమా కూడా మిమ్మల్ని అలరిస్తుంది. అందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ.. శివాజీ గారికి ధన్యవాదాలు. ఆయన ఫస్ట్ హీరో, ప్రొడ్యూసర్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఈ సాంగ్ విషయంలో కూడా శివాజీ గారికి థాంక్స్ చెప్పాలి. ఆ సాంగ్ యాడ్ చేసిన తర్వాత సినిమా మరింత అద్భుతంగా కనిపించింది. ఆ సాంగ్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. లయ గారి ఉత్తర పాత్ర గుర్తుండిపోతుంది. మా టీమ్ అందరికీ థాంక్యు సో మచ్. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది.
యాక్టర్ ప్రిన్స్ మాట్లాడుతూ.. శివాజీ గారు ఈ మధ్య కాలంలో చేస్తున్న కోర్ట్ దండోరా సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. శివాజీ గారు లయ గారిది హిట్ కాంబినేషన్. ఆ కాంబినేషన్లో మళ్ళీ వస్తున్న ఈ సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది
సింగర్ భోలే షావలి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శివాజీ గారు ఒకరిని గెలిపించాలనుకునే వ్యక్తి. నాకు సాంగ్ ఇస్తానని మాట ఇచ్చారు. నిజంగానే ఆయన మాట నిలబెట్టుకున్నారు. నాకు ఈ సాంగ్ అవకాశం ఇచ్చిన శివాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ పాటలో చేసిన అలీ గారు బండ్ల గణేష్ గారు అందరూ అద్భుతంగా చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ అలరిస్తుంది
చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ మాట్లాడుతూ.. శివాజీ గారితో మరొకసారి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది మంచి క్రైమ్ కామెడీ సినిమా. మీ అందరికీ నచ్చుతుంది. ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను
నటీనటులు:శివాజీ, లయ, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ శివాజీ ప్రొడక్షన్స్
నిర్మాత : శివాజీ సొంటినేని
రచన – దర్శకత్వం : సుధీర్ శ్రీరామ్
సంగీత దర్శకుడు : రంజిన్ రాజ్
ఎడిటర్ : బాలు మనోజ్.డి
కెమెరామెన్ : రిత్విక్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ లింగం, ధీరజ్.పి
కో డైరెక్టర్ : గుడివాక శివ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ : బాలాజీ శ్రీను కరెడ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్

