హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమంటే…

నందమూరి హరికృష్ణ కు డ్రైవింగ్ బాగా ఇష్టం. ఆయన డ్రైవింగ్ మీద ఎన్టీ రామారావు కూడా బాగా గురి. అందుకే తెలుగు నేల నాలుగు చెరగులా చేయాలనుకున్న తన తెలుగు దేశం ఆవిర్భావ  జైత్ర యాత్రలో చైతన్యరథసారిధిగా ఆయన హరికృష్ణ నే ఎంచుకున్నారు.

మరొకరయిన ఒక అరడజను డ్రయివర్లను ఎంచుకుని యాత్రసాగించేవారు.  యాత్ర ప్రారంభమయి ముగిసే దాకా హరికృష్ణయే ఎన్టీయార్ సారిధిగా ఉన్నారు. అందుకే ఎన్టీరామారావు యాత్రకు ఎంత పేరు వచ్చిందో హరికృష్ణ కు అంతే గుర్తింపు వచ్చింది.

అందుకే తెలుగు దేశం పార్టీ విజయంలో హరికృష్ణకు కూడా  చాలా పెద్ద పాత్ర ఉంది.

తండ్రి ఎన్టీఆర్‌ హరికృష్ణనే రథసారధిగా ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. అంతకు ముందు ఎన్టీయార్  సినిమా షూటింగ్‌లకు వెళ్లేటపుడు కూడా  హరియే స్వయంగా కారు నడిపే వారు. ఎంతమంది  డ్రైవర్లు అందుబాటులో  ఉన్నా తనకారును తానే  స్వయంగా నడపడమంటేనే హరికృష్ణకు ఇష్టం. డ్రైవింగ్‌లో ఆయన నిష్ణాతుడని ఆయనతో పరిచయం ఉన్నవాళ్లంతా చెబుతారు.

డ్రైవర్ ని పెద్ద గాఇష్టపడకపోవడం వల్లే నెల్లారు జిల్లా కావలిలో ఓ పెళ్లికి వెళ్లాలనుకున్నపుడు  బుధవారం తెల్లవారుజామున తానే స్వయంగా వాహనం నడిపేందుకు సిద్ధమయ్యారు.నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఎంతో ఇష్టమైన డ్రైవింగే.. వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని, 2009లో నల్లగొండ జిల్లాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్డుప్రమాదంలో గాయాలపాలై.. అదృష్టవశాత్తు బయటపడ్డారని, నాలుగేళ్ల కిందట హరికృష్ణ తనయుడు జానకీరామ్‌ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు హరికృష్ణ సైతం రోడ్డుప్రమాదంలోనే మరణించారు.

 

మరిన్ని వార్తలు 

హరికృష్ణ జీవితం ఇలా సాగింది…

 

సమైక్యాంధ్రకోసం రాజీనామా చేసిన ఒకే ఒక్కడు…

 

హరికృష్ణ స్వహస్తాలతో రాసిన చివరి లేఖ