ఎన్టీఆర్ ఫోటోతో ఫ్లెక్స్… మొరగడం తగ్గించుకుంటే మంచిది!

గతకొన్ని రోజులుగా ఎన్టీఆర్ పేరు మీద దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఆ ఫ్లెక్సీలలో టీడీపీ నేతలను దుయ్యబడుతూ.. ఎన్టీఆర్ ని సమర్ధిస్తూ కంటెంట్ హాట్ హాట్ గా ఉంటుంటుంది. పైగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని టీడీపీ నేతలు ఓ పులుపెక్కిపోతున్నారని అంటున్న సమయంలో ఈ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది.

దసరా పండగ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఒక ఫ్లెక్స్ వెలిసింది. ఇందులో సీనియర్ ఎన్ టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో పాటు హరికృష్ణ, తారకరత్న ఫోటోలు ఉన్నాయి. ఇక ఆ ఫ్లెక్స్ లో ఉన్న కంటెంట్ టీడీపీ నేతలకు చెంపపెట్టు అనే కమెంట్లు చేయడానికి బలం చేకూరుస్తుంది! పల్నాడు జిల్లాలోని వెల్లటూరులో ఈ ఫ్లెక్స్ దర్శనమిచ్చింది. గుర్తుతెలియని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు ఓ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు.

“ఒక మనిషి మౌనం వెనక బోలెడు కారణాలు ఉండొచ్చు. సందు దొరికితే బురద జల్లే వర్గం మీరు స్పందించమంటారు. స్పందించిన తరువాత నోటికి ఏది వస్తే అది వాగుతారు. దయచేసి మీరు ఎన్టీఆర్ గురించి ఎంత మొరగడం తగ్గించుకుంటే అంత బాగుంటుంది. రాజకీయంలోకి ఎన్టీఆర్ ను లాగొద్దు, మీ పని మీరు చూసుకోండి..”! అని ఆ ఫ్లెక్స్ లో మేటర్ రాసి ఉంది!

దీంతో… చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా స్పష్టంగా చెప్పారని అంటున్నారు అభిమానులు! కారణం… స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత చాలామంది టీడీపీ నేతలు.. ఎన్టీఆర్ స్పందించలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. బాలకృష్ణ అయితే ఓ అడుగు ముందుకేసి “ఎవరు ఖండించకపోయినా నేను పట్టించుకోను, ఐ డోంట్ కేర్” అని కూడా అనేశారు!

దీంతో బాలయ్యకు అన్ని విషయాల్లోనూ డోంట్ కేరే… తండ్రిని వెన్నుపోటు పొడిచి, కళ్లముందే అనాదశవంలా తండ్రి చచ్చిపోతేనే.. డోంట్ కేర్ అని వదిలేసిన్వారికి… ఇమ ఏదైనా డోంట్ కేరే అనే స్థాయిలో సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకున్నారు! ఈ సందర్భంలోనే వెల్లటూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. టీడీపీలోని ఏ నాయకుడి పేరూ ప్రస్థావించకుండా… గట్టిగా ఇచ్చిపడేశారు.

ఇదే సమయంలో… ఎన్టీఆర్ గురించి మొరగడం తగ్గించుకుంటే మంచిదంటూ ఫ్లెక్సీ ఏర్పాటుచేసి, కొంతమంది నాయకుల్ని కుక్కలతో పోల్చారని అంటున్నారు. ఫలితంగా పేర్లు ప్రస్థావించకపోయినా… జూనియర్ ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో తెలిసి కూడా ఆయన స్పందించాలని సన్నాయి నొక్కులు నొక్కిన టీడీపీ నేతలను కుక్కలతో పోల్చడంతో లోలోపల కుమిలిపోతున్నారని అంటున్నారు.