వైసిపిలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డి

మొత్తానికి నెల్లూరు జిల్లా కు చెందిన  సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన చేరుతారని చాలా రోజులుగా నానుతూ వస్తున్నది. చివరకు ఈ రోజు ఆ పని పూర్తి చేశారు.  పార్టీ లో చేేరేందుకు ఆయన విశాఖలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రకు వచ్చారు.

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తపెంట గ్రామంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  అనం ఇలా ఉన్నారు.  2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది.  ప్రజలను టీడీపీ, బీజేపీ కలసి దారుణంగా మోసం చేశాయి . నాలుగు సంవత్సరాలు కలిసి కాపురం చేసి ఇప్పుడు విడిపోయామంటూ  ఆ పార్టీలు  కొత్త నాటకానికి తెర తీశాయి.  రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే విడిపోయినట్టు డ్రామాలాడుతున్నాయి.   తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేసి ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారు.  ప్రజలకు అండగా అంటానని చెప్పేందుకే  వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

 

ఆనం రామానారాయణ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తుందని పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

ఇది కూడా చదవండి

నెల్లూరు జిల్లాలో ఆనం కష్టాలు ఇవి