ఇజ్జత్ అనిపిస్తుంది…అందుకే టిఆర్ఎస్ కండువా కిందపడేస్తున్నాం (వీడియో)

నిజామాబాద్ టిఆర్ ఎస్ లో ముసలం పుట్టింది. 2014 ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని టిఆర్ ఎస్ క్లీన్ స్వీప్ గా కైవసం చేసుకొని రికార్డుల మోత మోగించింది. కానీ ఇప్పుడు అదే టిఆర్ ఎస్ లో చిచ్చురేగింది.

టిఆర్ ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. స్వంత పార్టీ నేతలే ప్రజలల్లోకి వెళ్లలేక పోతున్నారు. చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు, మరి కొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో టిఆర్ ఎస్ అధినాయకత్వం ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఓ టివి ఛానల్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో టిఆర్ ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టిఆర్ ఎస్ పార్టీ నేతలను ప్రజలు నిలదీయడంతో వారిక ఏం చెప్పాలో తోచలేదు. దీంతో టిఆర్ ఎస్ పార్టీ కండువాలే పక్కకు పెడుతున్నామని టిఆర్ ఎస్ నేతలు కిషన్ నాయక్, చెన్నారెడ్డిలు నిర్ణయం తీసుకున్నారు.  దీంతో అక్కడి ప్రజల నుంచి వారికి మద్దతు లభించింది.   సభలో వారు  మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

 

NZB TRS LEADERS

ప్రజలంతా టిఆర్ ఎస్ పార్టీని నిలదీయడంతో నిజమే టిఆర్ ఎస్ పాలనలో అభివృద్ది జరగలేదని, తాము కూడా సొంత డబ్బులు పార్టీ కోసం పెట్టామని అయినా ప్రజలలో తగిన గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ భవన్ నిర్మాణం కోసం చందాలు కట్టినం. అప్పటి నుంచి పార్టిలో ఉన్నా గుర్తింపు లేదు. ఇజ్జత్ అనిపిస్తుంది. అందుకే పార్టీ కండువా పక్కకు పెడుతున్నామని వారు ప్రకటించారు. రైతు కండువలు కప్పుకొని ఇక నుంచి రైతుల పక్షాన పోరాడుతామని ప్రకటించారు.