చంద్రబాబుకు ఒక డాక్టర్ ఇచ్చిన 16 సలహాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి తీరు చూస్తూ ఆయన  మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారేమో అనిపిస్తుంది.  ఎందుకంటే, ఈ రోజు ఆయన విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వారం రోజుల కిందట కూడా ఆయన ఒక సారి  ఉత్సాహంగా ప్రెస్ వాళ్లతో    మాట్లాడారు. తాను రాజకీయాల్లో లేనని, ఏ పార్టీలో లేనని,  ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదని అంటూనే ఆయన కొన్ని సంఘటన పట్ల స్పందిస్తున్నారు.  రాజకీయాల పట్ల స్పందించడమే రాజకీయమే. రాజకీయమంటే ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, ఎన్నికల్లో పోటీ లో ఉన్నఒకరికి సాయం చేయాలనుకోవడం, మరొకరిని మటి కరిపించాలను కోవడం కూడా ారాజకీయమే. ఈ రోజు ఆయన ఏమ్మాట్లాడారో చూడండి…

1, రాష్ట్రంలోను కేంద్రం లోను జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రజలకు వాస్తవం తెలిజేయాాలని మీడియా ముందుకు వచ్చాను.

2. విభజన కు ముందు నాలాంటి కొందరు రాజకీయ నాయకులు విభజన అనివార్య అయితే మన రాష్ట్రనికి ఎమీ కావాలని సమావేశాలు నిర్వహిస్తే మా దిష్టి బొమ్మ లు తగులబెట్టారు.

3.  ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం మీద ఎదురు దాడి చేస్తే రాజకీయంగా తమకు లబ్ది జరుగుతుందని ప్రభుత్వం ,పతిపక్ష పార్టీ లు వ్యహరిస్తున్నాయని అన్నారు.

4.  ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ పార్టీలు బంద్ దీక్షలు ,దర్నాలు నిర్వహిస్తున్నాయి.

5. ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళి మీడియా సమావేశాలు కాదు కేంద్ర ప్రభుత్వం కి వచ్చిన అనుమానాలు ను నివృత్తి చేసి రాష్ట్ర నికి మంచి జరిగే విధంగా ప్రయత్నం చేయ్యాలి.

6. ప్రతిపక్షం కూడా అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తే నే పరిశ్రమలు వస్తాయని అంటున్నారు.. కాని ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిశ్రమలు కు రాయితీ లు ప్రకటింటం వల్లన వారికి లబ్ది జరుగుతుంది..

7. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్డాలంటే ప్రభుత్వం వసతులు ఏర్పాటులు చేయ్యాలి. అవి లేకుండా కేంద్రం ప్రభుత్వం ఒక్కటే పారిశ్రామిక సీటి కట్టలేదు ,ప్రభుత్వం ,పతిపక్షం బాధ్యత మరిచిపోయాయి.

8. విభజన చట్టం లో ఉన్న కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేయ్యాల్సింది కేంద్ర ప్రభుత్వం. అదిశగా పది సంవత్సరాల లో అ విద్య సంస్థలు ఎర్పాటు చేయ్యాలి అలా అని 10 విద్య సంస్థలు ఓకే సారి పెట్టాలని కాదు.

9. రాష్ట్రంలో అనేక హమీలు ఇచ్చిన ప్రభుత్వం కొన్ని అమలు చెయ్యటానికి ప్రయత్నం చేశారు మంచిది

10 రాష్ట్రంలో విభజన సమయంలో ఏమీ కావలని అడుగుతుంటే మనల్ని చెప్పనివ్వలేదు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అదికావాలి ఇది కావాలి అని అంటున్నారు

11. కేంద్ర ప్రభుత్వం అనేక విషయాలు లో డి పి అర్ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు

12.  రాష్ట్రంలో ఉన్న మీడియా వ్యవస్దలతో రాజకీయ పార్టీల తో సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రయోజనాలు కోసం ప్రయత్నం చేయ్యాలి.

13. రాష్ట్ర అభివృద్ధి లో మీడియా కూడా కీలకంగా వ్యవహరించి రాజకీయ పార్టీలను నడిపించాలి.

14. ప్రత్యేక హోదా విషయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం చేసి ప్రత్యేక హోదా సంజీవని కాదని తెలిపారు..ప్రజలలో ప్రత్యేక హోదా సెంటిమెంట్ ను రాజకీయ పార్టీలు బలంగా తీసుకుని వెళ్ళాయి.

 

15.ప్రభుత్వం అంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకునేది కాదు దానికి  ఒక వ్యస్ద వుంటుంది ఎలా పడితే అలా నాకు ఐదు లక్షల కోట్లు కావాలని అడగడం కాదు.

 

16. పార్లమెంటు లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ ఉచ్చులో పడినట్లు నేను నమ్ముతున్న. అలాగే జగన్ కూడా మీ ఉచ్చులో పడ్డాడు.

ఇవన్నీ చూస్తే ఆయన స్పష్టంగా భారతీయ జనతాపార్టీని, మోదీని వెనకేసుకొస్తున్నారని అనుకోవాల్సిందే.