మళ్లీమళ్లీ అదే తప్పు చేస్తున్న సీఎం జగన్.. నోటికి తాళం వేశారంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను, వైసీపీ కార్యకర్తలను ప్రస్తుతం ఒక విచిత్రమైన ప్రశ్న వేధిస్తోంది. ఏపీ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు జగన్ దృష్టికి వెళ్లడం లేదా? లేక ప్రజలు, వైసీపీ కార్యకర్తల సమస్యలు జగన్ దృష్టికి వచ్చినా జగన్ వాటిని పట్టించుకోవడం లేదా? అనే చర్చ ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ కుప్పం నియోజకవర్గం కార్యకర్తలను కలవడంతో ప్రజల సమస్యలు, కార్యకర్తల కష్టాలు జగన్ కు తెలుస్తాయని అందరూ భావించారు.

అయితే జగన్ మాత్రం వైసీపీ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలవాలని కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పినట్టు సమాచారం. జగన్ చెప్పింది తాము విన్నామే తప్ప తాము చెప్పింది జగన్ వినలేదని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల కష్టనష్టాల గురించి తెలుసుకోకుండా జగన్ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఫలితం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ ఊరించి ఉస్సూరుమనిపించారని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం మాట్లాడేందుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదని పలువురు కార్యకర్తలు బాధపడుతున్నారు. కార్యకర్తల వల్లే జగన్ గెలిచారని కానీ కార్యకర్తలను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు వైసీపీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ చుట్టూ భజన బ్యాచ్ ఉందని ఆ బ్యాచ్ వల్ల జగన్ కు వాస్తవాలు తెలియడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సరైన కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ అయినా అధికారంలోకి రాదని కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యేలా జగన్ వ్యవహరించడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విధంగా కార్యకర్తలతో భేటీ నిర్వహించడం వల్ల వైసీపీకి అణువంతైనా ప్రయోజనం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ కార్యకర్తల విషయంలో మారాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.