Home Andhra Pradesh వైఎస్ జగన్ నిద్రపోవాలి అంటే... అచ్చెన్నాయుడు అంత మాట అనేశాడేంటి ?

వైఎస్ జగన్ నిద్రపోవాలి అంటే… అచ్చెన్నాయుడు అంత మాట అనేశాడేంటి ?

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో దేవాలయాలలో జరుగుతున్న దాడుల అంశం మీద తాజాగా జరిగిన అమ్మఒడి ప్రారంభంలో సిఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నెల్లూరు అమ్మఒడి సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్ష పార్టీలు దేవాలయాలను ధ్వంసం చేసి పరిశీలనకు వెళ్తున్నాయన్నన్న జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. బడులు మీద దాడులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ శ్రీరంగ నీతులు చెప్తున్నారు అని విమర్శిస్తున్నారు. మీ దాడులు లక్ష్యం బడులపై పెట్టి ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. తెల్లారి లేస్తే రాష్ట్రంలో ఏదో ఒక విధ్వంసం జరిగేతేనే మీకు నిద్ర పడుతుంది అని ఆయన ఎద్దేవా చేసారు.

Atchannaidu Gave Strong Reply To Ys Jagan
Atchannaidu gave strong reply to ys jagan

ప్రజలు మీకు సుపరిపాలన చేయటానికి అవకాశం ఇస్తే, మీ పాలన విద్వంసంతో ప్రారంభమైంది అని ఆయన అన్నారు. ప్రజా వేదిక కూల్చి ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన నీచ సంస్కృతి మీది అని ఆయన మండిపడ్డారు. 140 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరోజైనా స్పందిచావా? అని నిలదీశారు. నీ కనుసన్నల్లో దేవాలయాలపై దాడులు జరిగాయి అని విమర్శించారు. అందువల్లే దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శన చేయలేదు అని విమర్శించారు. ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వస్తుందా? మీ పుట్టిన రోజులు చేస్తే కరోనా రాదా? అని నిలదీశారు. బ్రాందీ షాపులు, స్కూళ్లు తెరిస్తే కరోనా రాదా? బ్రాందీ అమ్మి వాళ్ల రక్తం తాగితే కరోనా రాదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఆలయంలో అయినా స్కూల్ లో అయినా ఏ దాడులు జరిగినా కర్త, కర్మ, క్రియగా జగనే ఉంటారు అని అచ్చెన్నాయుడు ఖరాఖండిగా తేల్చేశారు.

- Advertisement -

Related Posts

త్వరలో రైతులకి తీపికబురు చెప్ప‌నున్న మోడీ సర్కార్ … ఏంటంటే ?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అతి త్వ‌ర‌లో రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌నుందా ? అంటే.. అందుకు అవున‌నే సమాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రైతులకు ఏడాదికి రూ.6వేల‌ను కిసాన్ స‌మ్మాన్ నిధి...

విడుదలకు ముందు అనూహ్యపరిణామాలు .. కరోనా బారిన పడ్డ శశికళ !

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు ఆమె అనుచరులు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లను ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే...

గవర్నర్ తో భేటీ కానున్న నిమ్మగడ్డ.. ఆ వ్యవహారమే కారణమా ?

నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ని కలవనున్నారు. ఆయన కలవడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు చిత్తూరు, కలెక్టర్ ల వ్యవహారం...

వేదాళం రీమేక్‌ను చిరంజీవి ప‌క్క‌న పెట్టాడా.. నిర్మాతలు ఏమంటున్నారు!

తొమ్మిదేళ్ళ త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ ఇది పూర్తి కాక ముందే మరో...

Latest News