అంధ్ర ప్రదేశ్ ను చూసి ముచ్చట పడి ఇండోనేషియాకు చెందిన ఏసియా పల్ప్ అండ్ పేపర్(APP)అనే కంపెనీ రు. 24,500 కోట్ల పెట్టుబడి పెట్టి ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద పేపర్ మిల్ పెడుతున్నదంటే అంతా రికార్డు అన్నారు. ఆంధ్ర విదేశీ పెట్టుబడుల విషయంలో జాక్ పాట్ కొట్టిందనుకున్నారు. అయితే, ఎపిపి ఒక దగుల్బాజీ కంపెనీ అని అని కాలుమోపితే విధ్వంసమే నని, ఆ కంపెనీ అడవులన్నింటి తినేసి ఎడారిగా మారుస్తుందని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) హెచ్చరిస్తూ ఉంది. ఈ కంపెనీ గురించి ఆసక్తి కరమయిన వివరాలు ఇపుడు బయటకు వస్తున్నాయి. ప్రపంచంలో పర్యావరణ నిపుణులు తీవ్రంగా ద్వేషించే కార్పొరేట్ కంపెనీలలో ఇదొకటి.
30 సంవత్సారాలు పాటు ఇండోనేసియాలో ఈ అటవీ విధ్వంసం సృష్టించడమే కాదు, అడవుల పునసృష్టిచేస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసింది, రైతులను ఫ్యాక్టరీ కలప కోసం భూసేకరణ చేసి రైతులను మోసిగించింది, అడవుల నరికివేతను నిలిపేస్తానని ప్రామీస్ చేసి మాయ చేసింది అంతర్జాతీయంగా పేరుమోసి ఎన్జీవో లు (నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) ఈ కంపెనీమీద దుమ్మెత్తిపోసున్నాయి. ఈ కంపెనీ తానే ప్రకటించిన అటవీ సంరక్షణ ను కూడా పాటించకుండా మోసం చేసిందని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి అంతర్జాతీయ అటవీ సంరక్షణలో ఉన్న ఎన్జీవోలన్నీ ఎపిపి మీద, ఎపిపి మాతృసంస్థ సినార్ మాస్ గ్రూప్ (SMG) మీద యుద్దం ప్రకటించాయి. ఇలాంటి దగుల్బాజీ కంపెనీతో బిజినెస్ చేయడం మానేయండని అంతర్జాతీయ కంపెనీలకు, ఫైనాన్సియల్ ఇన్వెస్టర్లకు WWF విజ్ఞప్తిచేసింది.అడవుల విధ్వంసం ఆపి Forest Stewardship Council (FSC) రోడ్ మాప్ సూచించిన విధంగా సంరక్షణ చర్యలు తీసుకుంటానని చేసి వాగ్దానం అమలు చేయడంలో ఎంత ప్రగతి ఉందనేదాన్ని నమ్మకమయిన ధర్డ్ పార్టీ వెరిఫికేషన్ ను జరిగే ఎవరూ APP తో బిజినెస్ చేయరాదని WWF కోరింది.
ఈ వెరిఫికేషన్ జరగలేదు. ఎపిపి విధ్వంసంకొనసాగుతూనే ఉంది. అయినా సరే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి జంకు గొంకు లేకుండా ఎపిపి కి ఆంధ్రలోని అడవులను మేతగా వేసేందుకు సిద్ధమయింది. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విధానాల వల్ల అడవులు, పర్యావరణ నాశనమవుతున్నాయని ఇఎఎస్ శర్మవంటి మేధావులు పోరాడుతూనే ఉన్నారు. అయినాసరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధ్వంసకర పేపర్ మిల్ కు శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీ విఫయంలో జాగ్రత్త పడకపోతే, ఆంధ్రప్రదేశ్ చాలా నష్టం జరుగుతుంది.
ఎపిపి చేసే కార్యకలాపాలు ఇలా ఉంటాయి.
#అడవులను ధ్వంసం చేయడం
# పల్ప్ వుడ్ ప్లాంటేషన్ కోసం అడవులను తగలబెట్టడం
# పర్యావరణ పరిరక్షణ చర్యలు ఏమాత్రం చేపట్టకం పోవడం
ఎపిపి విధానాలు ప్రమాదకరమయినవి కావడంతో ఈ సంస్థకు సహకరించాలనుకున్న అంతర్జాతీయ పర్యావరణ సంస్థలన్నీ ఎపిపి తో సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఏపిపి మీద పర్యావరణ యుద్ధం ప్రకటించాయి.
అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక అటవీ విధ్వంసాన్ని ఇక నిలిపివేస్తామని 2013 లో SMG/APP ఒక ఫారెస్ట్ కన్సర్వేషన్ పాలసీని ప్రకటించింది. అంతకుముందు SMG/APP తో పాటు, ఈ కంపెనీకి పల్ప్ వుడ్ ను సరఫరా చేసిన కంపెనీలు 30 సంవత్సరాల పాటు అడవులను ధ్వంసం చేశాయి. వన్యమృగాలకు నీడ లేకుండా చేశాయి. వాతావరణలోని కార్బన్ డైయాక్స్ డు పీల్చుకునే పీట్ ల్యాండ్స్ ను ఎండగట్టాయి. ఈ కంపెనీ కలప వృక్షాలను నరికేయాలనుకోవడం, పల్ప్ వుడ్ ప్లాంటేషన్ కోసం భూసేకరణ ను పూనుకోవడంతో సుమత్రా, కాలిమంతన్ ప్రాంతాలలో రైతులతో గొడవలు మొదలయ్యాయి. ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలున్నచోటల్లా సాంఘిక అశాంతి తలెత్తింది.
అడవుల విధ్వంసం నివారించేందుకు అంతర్జాతీయ ఒక కూటమి పనిచేస్తూ ఉంది. ఈ యాంటి ఫారెస్ట్ మాఫియా కొయలిషన్ (Anti Forest-mafia Coalition) లో ఇండోనేషియా-వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కూడా భాగస్వామియే. ఈ కూటమి 2018 ఆగస్టులో ఒక ఇన్వెష్టిగేషన్ రిపోర్టును విడదల చేసింది. తూర్పు కలిమంతన్ లో ఎపిపికి కలప సరఫరా చేస్తున్న పిటి.ఫజర్ సూర్య స్వాదయ (FSS), పిటి. సిల్వా రింబా లెస్తారి (జారుమ్ గ్రూప్)లు కలసి సుమారు 32000 హెక్టేర్ల సహజ అడవిని నరికేశాయి. ఎపిపి యే స్వయంగా ప్రకటించిన ఫారెస్ట్ కన్సర్వేషన్ పాలసీని తుంగలో తొక్కిన కంపెనీలనుంచి కలపను కొనింది.
ఆ మరుసటి రోజే ఎపిపి, దానితో బిజినెస్ చేస్తున్న ఇతర కంపెనీలుచేస్తున్న అటవీ విధ్వంసాన్ని భరించలేక ఫారెస్ట్ స్టెవర్డ్ షిప్ కౌన్సిల్ (FSC) ఈ కంపెనీతో సంబంధాలు తెంచేసుకుంది.
FSC గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
ఎపిపితో బిజినెస్ చేయవద్దని WWF ప్రపంచ కంపెనీలకు ఇచ్చిన పిలుపుకోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ కంపెనీ అటవీ విధ్వంసంలో నే కాదు కార్పొరేట్ మేనేజ్ మెంటులో కూడా వివాదాస్పదయిందే. ఈ కంపెనీఅనేక షాడో కంపెనీలను ఏర్పాటుచేసి అడవులను విధ్వంసం చేసి తన చేతికి నెత్తురు అంటకుండా చూసుకుంటున్నదని చెయిన్ రియాక్షన్ రీసెర్చ్ పరిశోధనలో తేలింది. తాను అడవులను ధ్వంసం చేయడంలేదని, తనకు ముడిసరుకులు సరఫరా చేస్తున్న కంపెనీలతో తమకు సంబంధం లేదని చెబుతూ వచ్చింది. అయితే, ముడిసరుకును సరఫరా చేస్తున్న కంపెనీలన్నీ ఏదో విధంగా విడ్జాజా కుటుంబానికి సంబంధించినవేనని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక వెల్లడించింది. అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్డు అనేక ఎపిపి వోనర్ విడ్జాజా కుటుంబం గురించి ఆశ్చర్య కరమయిన వివరాలను ప్రపంచం ముందుంచింది.
ప్రపంచంలో నెంబర్ వన్ పేపర్ తయారీ దారు అయిన విడ్జాజా కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఒక కుటుంబం లాభాల కోసం ఇండోనేషియాలోని రెయిన్ ఫారెస్టులో అంతరించిపోతున్నాయని ప్రపంచంలోని పర్యావరణ పరిరక్షణ గురించి పోరాడుతున్న సంస్థలన్నీ ముక్తకంఠంతో మొత్తుకుంటున్నాయి. ఈ సంస్థలన్నీ ప్రపంచంలోని అడవులను కాపాడుకునేందుకు ఈ విధ్వంసక ఏపిపితో ఎలాంటి వ్యాపారం చేయవద్దని పిలుపునిచ్చాయి. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపిపి పేపర్ మిల్లుకు విరివిగా వసతుల కల్పించి ఆహ్వానిస్తున్నది. తెలుగు రాష్ట్రాలలోని పర్యావరణ నిపుణులు ఈ విషయాన్ని గమనించాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత 35 సంవత్సరాలలో 1125 చదరపు కిమీ అడవులను ఇతర కార్యకలాపాలకు ద్వంపం చేయాల్సి వచ్చింది.అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరొక 2000 హెక్టేర్ల అడవులను మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అనుమతినిచ్చింది. ఇపుడు ఎపిపి పేపర్ మిల్లు ఈ విధ్వంసాన్ని తారాస్థాయికి తీసుకువెళ్ల నుంది.
పర్యావరణ పరిరక్షణలో పేరుమోసిన గ్రీన్ పీస్ సంస్థ కూడా ఎపిపితో తెగతెంపులు చేసుకుంది. ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
అడవులను ధ్వంసం చేస్తున్నలు మావి కావు అని ఎపిపి వంటి సంస్థలు మాయమాటలెలా చెబుతాయో తెలుసుకోవాలనుకుంటే Chain Reaction Research నివేదికలోని అంశాలు తెలుసువాల్సి. దీనికోసం ఇక్కడ క్లిక్ చేయండి