బ్రేకింగ్ న్యూస్ : చేతులెత్తేసిన ప్రభుత్వం..కేసు మూసేస్తున్నట్లు నోటీసులు

నిజంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటనటంలో సందేహం లేదు. 2014 డిసెంబర్ 29వ తేదీన రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లో పంట పొలాలు తగలబడ్డాయి గుర్తుందా ? ఆ కేసులో నిందితులను ఎవరిని పట్టుకోలేకపోతున్న కారణంగా కేసును క్లోజ్ చేసేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. నిందుతలను ఎవరినీ పట్టుకోలేకపోతున్నామని ప్రభుత్వం ఒప్పుకున్నదంటే మరి పంటలు తగలబెట్టింది జగన్మోహన్ రెడ్డి మనుషులే అని చేసిన ఆరోపణల మాటేమిటి ? చాలామంది వైసిపి నేతలను నిర్భందించి విచారణ  చేశారు కదా ? వందలాది మంది రైతులను రోజుల తరబడి నిర్భందించిన మాటేంటి ?

 

ఈ అంశాలే ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. నాలుగేళ్ళ క్రితం డిసెంబర్ 29వ తేదీన అర్ధరాత్రి పై మండాల్లోని 13 మంది రైతుల పొలాల్లోని పంటలు తగలబడ్డాయి. పంటలతో పాటు వ్యవసాయ పనిముట్లు కూడా మంటలకు ఆహుతయ్యాయి. అప్పట్లో ఆ ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. ఎందుకంటే, రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం రైతుల నుండి పొలాలను సేకరిస్తోంది. కారణాలేవైనా చాలామంది రైతులు పొలాలిచ్చినా ఇంకా కొన్ని గ్రామాల్లోని  రైతులు మాత్రం పొలాలివ్వటానికి ఇష్టపడలేదు.  పొలాల కోసం ఒత్తిడి పెట్టిన ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. దాంతో హఠాత్తుగా ఒకరోజు అర్ధరాతి పొలాలు తగలబడ్డాయి. అందుకే ఘటన సంచలనమైంది.

 

ఎప్పుడైతే పొలాలు తగలబడ్డాయో వెంటనే అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అండ్ కో పంటలను తగలపెట్టింది జగన్ అండ్ కో పనే అంటూ ప్రకటించేశారు. దానిపై చంద్రబాబు ఓ వారంపాటు తన మీడియాను అడ్డంపెట్టుకుని రెచ్చిపోయారు. స్ధానిక వైసిపి నేతలను పోలీసు స్టేషన్లకు పిలిపించుకుని విచారించారు. వందలాదిమంది రైతులను కూడా విచారించారు. విచారణ పేరుతో నిర్భందించారు. పంటలు తగలబడటానికి జగన్ అండ్ కో నేతల పనే అని చెప్పమంటూ కొందరు రైతులపై ఒత్తిడి కూడా పెట్టారట. కానీ రైతులెవరూ ఒత్తిడికి లొంగలేదు. ఆ తర్వాత కేసు రాజకీయ రంగు పులుముకుంది.

 

అంత గందరగోళం జరిగిన ఆ కేసులో నాలుగేళ్ళ తర్వాత తీరిగ్గా చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. పంటలు తగలబడిన ఘటనలో నిందితులెవరినీ పట్టుకోలేకపోయారట. విచారణ ముందుకు సాగటంలేదు కాబట్టి కేసును మూసేస్తున్నట్లు ప్రభుత్వం రైతులకు నోటీసులిచ్చింది.  అప్పట్లో పోలీసు విచారణను ఎదుర్కొన్న రైతులు ఇఫుడు చంద్రబాబుపై మండిపోతున్నారు. ఘటనపై న్యాయవిచారణకు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే తమ పంటలను తగలబెట్టి నెపాన్ని వైసిపిపైకి నెట్టేసిందంటూ ఇపుడు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను విచారించటానికి సిట్ విచారణ కూడా వేసింది. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒక్క కేసును కూడా సమర్ధవంతంగా చేందించింది లేదు. కేసును మూసేస్తున్నట్లు ప్రకటించటం కూడా ఇదే మొదటి కేసులేండి. ఇంకెన్ని కేసులు మూసేస్తుందో చూడాలి.