కేసీఆర్ దొంగ నోట్ల కేసులో జైలుకు పోయేవాడే

ఏపీ సీఎం చంద్రబాబు పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఖండించారు. ఏపీ నేతలంతా విడివిడిగా మీడియాతో మాట్లాడారు.

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమన్నారంటే…

“ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇంత చండాలంగా మాట్లాడతారా… ఏపీ సీఎం చంద్రబాబు పై కేసీఆర్ దరిద్రమైన భాష మాట్లాడాడు. మాయ మాటలు చెప్పినంత మాత్రాన మొనగాడివి కాలేవు కేసీఆర్. నువ్వు మాట్లాడిన మాటల్లో ఒక్కటైన వాస్తవముందా కేసీఆర్? నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి. దళితుడిని సీఎం చేస్తానన్న మాట ఏమైంది. చంద్రబాబ మోసం చేశాడో కేసీఆర్ మోసం చేశాడో ప్రజలందరికి తెలుసు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని సోమిరెడ్డి హెచ్చరించారు.

మంత్రి కాల్వ శ్రీనివాసులు ఏమన్నారంటే

“రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న చంద్రబాబు ఎదుర్కోవడం జగన్ వల్ల కాదని, కేసీఆర్ ని మోదీ రంగంలోకి దించారు. 50 అంతస్థుల్లో ప్రభుత్వ కార్యాలయాన్ని, ర్యాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి ఇది అక్షరాలా నిజం. కేసీఆర్ నువ్వు మాట్లాడిన గలీజు భాష మాకు కూడా వచ్చు కానీ మాకు సభ్యత సంస్కారం ఉన్నాయి. అందుకే మాట్లాడుతలేం. నీలాగా నీచ రాజకీయాలు మాకు రావు. తాగి వాగుడు తప్ప  కేసీఆర్ కేం రాదు. చంద్రబాబు వద్ద టికెట్ల కోసం తిరిగిన వాడు కేసీఆర్. కేసీఆర్ బతుకు, అతని రాజకీయ బతుకు అందరికి తెలుసు. ఇలాంటి అహంకారపు మాటలు మాట్లాడితే ఖబడ్దార్” అంటూ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కేసీఆర్ మోదీకి అద్దె మైకు, జగన్ కు సొంత మైకు అని నక్కా ఆనంద బాబు విమర్శించారు.

దేవినేని ఉమా మహేశ్వరరావు ఏమన్నారంటే

“దొంగనోట్ల కేసులో జైలు కెళ్లాల్సిన కేసీఆర్ కి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు. అటువంటి నాయకుడిపై ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో.

2019లో టిడిపి మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. దొంగనోట్ల కేసు, ఎలుగుబంటి సూర్యనారాయణ కేసు,సహారా కేసు అన్నీ వెలుగులోకి వస్తాయి. కేసీఆర్ కాస్కో నీ పీకుడికి భయపడేవాడేవడు లేడిక్కడ. నీ మాటలన్నీ బిజెపి నేతల లాగనే ఉన్నాయి” అని దేవినేని విమర్శించారు.