గుడ్ న్యూస్ ఎపీ ప్రజలకి,మరో మంచి పధకాన్ని అమలు చేయబోతున్న జగన్ సర్కారు!

ap gvt gradding all pvt hospitals for arogyasri with in 15 days

కరోనా ప్రభావం వలన ఇబ్బంది కలగకుండా ప్రజలకి, వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్స అందేలాగా చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సేవలు, సదుపాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. గతంలో ఆరోగ్యశ్రీ వార్డ్ పేరుతో ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించుకునేవారిని ప్రత్యేకంగా చూసిన ఆస్పత్రులన్నీ.. కరోనా టైమ్ లో మాత్రం కనికరించాయి. పేదలకు మంచి వైద్యం అందించాయి.

ప్రభుత్వ సూచనతో కొవిడ్ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, అందుబాటులో వైద్యులు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్య మిత్ర.. ఇలా ఈ ఆరు ప్రమాణాలను కచ్చితంగా పాటించాయి. దీంతో కరోనా తర్వాత కూడా ఈ ఆరు ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చూడాలని, అలా పాటించినవారికే ఆరోగ్యశ్రీ అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఆరోగ్యశ్రీ అనుమతి తెచ్చుకున్నారంటే ఆ ఆస్పత్రి పంట పండినట్టేనని ఇప్పటివరకూ అంతా అనుకునేవారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులతో కార్పొరేట్ ఆస్పత్రుల పంట పండేది. ఇకపై అలాంటి అవకాశం లేకుండా చేయాలనుకుంటున్నారు జగన్.

ఆరోగ్యశ్రీ పథకంలోకి అదనపు వ్యాధుల్ని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో ఈ పాటికే ప్రక్షాళన చేశారు. రెండో దశలో ఆస్పత్రులని టార్గెట్ చేశారు. ప్రమాణాలు పాటించని ఆస్పత్రులను మొహమాటం లేకుండా ప్యానెల్ నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు జగన్.

15రోజుల డెడ్ లైన్..

వచ్చే 15రోజుల్లో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో వైద్య సేవల ఆధారంగా గ్రేడింగ్ జరపాలని సూచించారు సీఎం జగన్. ఆరోగ్యమిత్రల ఏర్పాటు, వారి సేవల తీరు చూసి ఈ గ్రేడింగ్ ఇస్తారు.

గ్రేడింగ్ ద్వారా ఏ ఆస్పత్రిలో మంచి వైద్యం అందుతోంది అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోతుంది. ఆ గ్రేడింగ్ ప్రకారం ప్రజలు కూడా ఓ అంచనాకి వస్తారు. గ్రేడింగ్ కోసమైనా.. ఆస్పత్రులు కచ్చితంగా సౌకర్యాలు మెరుగుపరుచుకుంటాయి.

అదే సమయంలో ఆరోగ్యశ్రీ రద్దు అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు కూడా సరిగా రావు. అందుకే ఆరోగ్యశ్రీ అనుమతిని కాపాడుకోవడం కోసం కచ్చితంగా కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని త్యాగాలు చేయక తప్పదు.

మొత్తమ్మీద ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకూ జరిగిన దుబారాకి కరోనా టైమ్ లో చెక్ పెట్టగలిగారు సీఎం జగన్. కరోనా టైమ్ లో కార్పొరేట్ ఆస్పత్రులకు కొన్ని ప్రమాణాలు అలవాటు చేసి.. వాటిని కొనసాగించేలా చేస్తున్నారు.