ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచి కూడా ఆర్ధిక భద్రతే లక్ష్యంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ వచ్చారు. వాటిలో కొన్ని మంచిగానే ఉన్నా…కొన్ని కొన్ని మాత్రం కాస్త ఇబ్బందులు కలిగినవి ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ మధ్యే కొత్తగా కొన్ని పథకాలను తీసుకువచ్చింది. ఆ పథకాల ద్వారా భర్యాభర్తలు ఇద్దరికీ ఏకంగా సంవత్సరానికి రూ.72.000 పెన్షన్ లాంటిది. నెలకు కేవలం 100రూపాయలు మనం జమ చేయడంతో.
భార్యభర్తలిద్దరూ కలిసి ఒక్కొక్కరుగా 100 రూపాయలు చెల్లిస్తే రూ.200 అవుతుంది. ప్రతి నెలా చెల్లించడం వల్ల కొన్ని ప్రయోజనాలను కల్పిస్తుంది కేంద్రప్రభుత్వం. మనం జమ చేసే డబ్బులు ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ట్రేడర్స్, సెల్ఫ ఎంప్లాయిడ్) అనేది పథకాలు.
శ్రమ్ యోగి మాన్‌ధన్, ఎన్‌పీఎస్ పథకాల్లో సులభంగానే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆధార్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ‘ఈ స్కీమ్స్‌లో చేరేందుకు 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్యలో చెల్లించొచ్చు. వయసు ప్రాతిపదికన ఈ నెలవారీ మొత్తం మారుతుంది’ అని సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు.
ఎన్‌పీఎస్, శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్స్‌లో 30 ఏళ్ల వయసు ఉన్న వారు చేరితే అప్పుడు వారి నెలవారీ చందా రూ.100 అవుతుంది. వీరి సంవత్సర చందా మొత్తం రూ.1,200. స్కీమ్‌లో చేరిన తర్వాత మొత్తంగా చెల్లించే డబ్బు రూ.36,000 అవుతుంది.
ఈ స్కీమ్స్‌లో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ డబ్బులు పొందొచ్చు. నెలకు కనీస పెన్షన్ రూ.3,000. అంటే సంవత్సరానికి రూ.36,000 డబ్బులు వస్తాయి. అంటే మీరు చెల్లించిన మొత్తం ఒక్క ఏడాదిలోనే మీకు పెన్షన్ రూపంలో వచ్చేస్తుంది. స్కీమ్‌లో చేరిన వ్యక్తి ఒకవేళ మరణిస్తే అప్పుడు వారి భాగస్వామికి నెలకు సగం పెన్షన్ అంటే రూ.1,500 వస్తాయి.
అసంఘటిత రంగంలోని పనిచేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. పీయూష్ గోయెల్ 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌లో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. నెలకు రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. మీకు 25 ఏళ్ల ఉంటే నెలకు రూ.80 చెల్లించాలి. 30 ఏళ్ల ఉంటే రూ.105, 35 ఏళ్ల ఉంటే రూ.150 చెల్లించాలి. ఈపీఎఫ్‌వో, ఎన్‌పీఎస్, ఈఎస్‌ఐ స్కీమ్స్‌లో ఉన్న వారికి దీనికి అనర్హులు.