అఖిల్ మనసును చెడగొట్టిన మల్లిక… జానకిని అపార్థం చేసుకున్న అఖిల్!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే.. జానకినీ చెడు చేయాలన్న ఉద్దేశంతో మల్లిక అఖిల్ కి లేనిపోనివి చెప్పి తన మనసు చెడగొడుతుంది. ఇలా జానకి గురించి అఖిల్ లేనిపోనివన్నీ ఊహించుకొని తనని అపార్థం చేసుకుంటాడు.ఇంతలోపు జానకి ఈసారి ఎలాగైనా ఎగ్జామ్స్ కి మంచిగా ప్రిపేర్ అవ్వాలని ఇంట్లో పనులన్నీ చెక్కబడుతూ ఉంటుంది అంతలో రామ వచ్చి మిమ్మల్ని కాలేజ్ దగ్గర ఉండమని చెప్పాను కదా అప్పుడే వచ్చేసారేంటి అని అడగడంతో మీరు ఏదైనా పనిలో ఉంటారని వచ్చేసాను అని చెబుతుంది.

ఇక రామ అఖిల్ విషయంలో సంతోష పడుతూ అఖిల్ కి జాబ్ వచ్చినట్టేనని కాలేజ్ దగ్గర తన ఫ్రెండ్ కలవడం తనకు విస్టింగ్ కార్డు ఇవ్వడం గురించి చెబుతాడు.అది విన్నటువంటి జానకి సంతోషపడుతుంది మీరే వెళ్లి ఈ కార్డు అఖిల్ కి ఇవ్వండి జానకి గారు అనడంతో వెంటనే జానకి వద్దు రామ గారు ఇప్పటికే అఖిల్ నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నాడు పొద్దున చూశారు కదా… మీరే వెళ్లి ఇవ్వండి అని రామాను పంపిస్తుంది. అంతలోపు అఖిల్ జెస్సి తో గొడవ పడుతూ ఉంటాడు. అక్కడికి రామ వెళ్లడంతో ఏంటి అన్నయ్య అని అడగగా తన ఫ్రెండ్ కంపెనీ పెడుతున్నాడని తనకు విస్టింగ్ కార్డు ఇచ్చి ఇంటర్వ్యూకు వెళ్ళమని చెబుతాడు.

అది చూసిన అఖిల్ వద్దు అన్నయ్య నేను ఎవరి రికమండేషన్ ద్వారా జాబ్ తెచ్చుకొని ముఖ్యంగా నువ్వు రికమెండ్ చేసి జాబ్ తెచ్చుకుంటే వదినా నా భర్త వల్లే అఖిల్ కు జాబ్ వచ్చిందని ఎంతమందికి చెప్పుకుంటుందో అంటూ తన ఆఫర్ ని వదులుకుంటాడు. అంతలో జెస్సి అక్క ఎప్పుడు అలా అనుకోదు తను ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది అని చెబుతుంది.సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టే వింటాను కానీ నీ పేరు అక్కడ ఉపయోగించను నా టాలెంట్ తోనే నేను జాబ్ తెచ్చుకుంటానని చెప్తాడు.

ఇక రామ గదిలోపలికి రావడంతో జానకి చాలా సీరియస్ గా చదువుతూ కనిపించడంతో రామా సంతోషపడతాడు. ఇక జాబ్ గురించి అఖిల్ తో మాట్లాడారా ఏమన్నారు అంటే తన రికమండేషన్ తో వచ్చే జాబ్ తనకు అక్కర్లేదంట అని రామా చెప్పడంతో నేను చెప్పాను కదా అఖిల్ నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నారని జానకి బాధపడి తిరిగి తను చదువుకుంటూ ఉంటారు.మరుసటి రోజు అఖిల్ ఇంటర్వ్యూకి బయలుదేరుతూ ఉండగా రామ వస్తానని చెప్పడంతో నాకు ఎలాంటి రికమండేషన్స్ వద్దని చెప్పాను కదా అన్నయ్య అంటాడు.

నేను కేవలం నిన్ను అక్కడి వరకు డ్రాప్ చేస్తాను లోపలికి కూడా రాను అని చెప్పడంతో అఖిల్ సరేనని రామాతో కలిసి ఇంటర్వ్యూకి వెళ్తాడు.ఇక అఖిల్ గురించి ఆలోచించినటువంటి జానకి తను ఎప్పుడు మారుతాడేమోనని ఆలోచిస్తూ లోపలికి వెళ్తుంది.ఇక రామ అఖిల్ ను దించేసి ఏదైనా అవసరమైతే నా పేరు చెప్పు అంటూ అఖిల్ కి సలహా ఇస్తే నేను రికమండేషన్ ఉపయోగించుకోనని చెప్పాను కదా అనడంతో రామా వెళ్లిపోతాడు. ఇక ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలన్నింటికీ అఖిల్ సమాధానం చెబుతూ ఉంటాడు. మరి అఖిల్ కు ఉద్యోగం వస్తుందా లేదా అనేది తర్వాత ఎపిసోడ్లు చూడాలి.