Akkineni Nagarjuna: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంట్లో ఘనంగా తన చిన్న కుమారుడు అఖిల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో అఖిల్, జైనాబ్ ల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. అయితే నేడు ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరిద్దరి వివాహపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వివాహపు వేడుక జరిగింది.
ఇక ఈ వివాహ వేడుకల కోసం నాగార్జున పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జైనాబ్ తల్లిదండ్రులతో పాటు అక్కినేని నాగార్జున దంపతులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మర్యాదపూర్వకంగా తన కుమారుడు పెళ్లికి ఆహ్వానించారు అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుని కూడా కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఇక నాగార్జున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నాగర్జున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మాత్రం పెళ్లికి పిలిచినట్టు ఎక్కడ వార్తలు బయటకు రాలేదు. దీంతో చంద్రబాబు నాయుడుని ఆహ్వానించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే నాగర్జున ఇలా చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున జగన్మోహన్ రెడ్డికి అనుకూలం జగన్ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కావడంతో పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించలేదని వార్త సంచలనగా మారింది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు ఒక నటుడు. ఇక మెగా కుటుంబంలో చిరంజీవి రామ్ చరణ్ లకు ప్రత్యేకంగా ఆహ్వానం అందజేసిన నాగార్జున పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఆహ్వానం అందజేయలేదనే చర్చలు జరుగుతున్నాయి. అయితే మరి కొందరు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ నాగార్జున పవన్ కళ్యాణ్ ని కలసి ఆహ్వానం అందజేశారని కాకపోతే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదని తెలుస్తుంది. అయితే వీరంతా పెళ్లికి రాకపోయినా 8వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరిగే రిసెప్షన్ వేడుకకు హాజరుకానున్నట్టు సమాచారం.