బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే ప్రేమ్ శృతి ఇద్దరు సరదాగా గడుపుతూ ఉండగా అదే సమయంలో అంకిత దివ్య కూడా అక్కడికి వస్తారు. వీరంతా కలిసి సరదాగా మాట్లాడుతూ ఉండగా లాస్య కూడా అక్కడికే వస్తుంది.ఓహో అందరూ సంతోషంగా గడుపుతున్నారా అని చాలా పాజిటివ్ వైస్ ఉన్నాయి అనడంతో నువ్వు కూడా తల్లి అయి ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది అంకిత అంటూ లాస్య సూటిపోటి మాటలతో అంకితను బాధపెడుతుంది. ఇంటి పెద్ద కోడలు నువ్వు ముందు తల్లి కావాలి కదా ఇలా మీరిద్దరూ ఒకేసారి తల్లులు అయ్యి ఉంటే ఆనందించేదాన్ని అంటూ లాస్య ఎత్తిపొడుస్తుంది.
దీంతో అంకిత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది నువ్వు వెళ్లిపోయిన నేను నిన్ను వదలను కదా అని లాస్య మనసులో అనుకుంటుంది.మరోవైపు తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి హానిని తీసుకొని గుడికి వెళ్తారు అదే గుడికి అనసూయ పరంధామయ్య కూడా వెళ్తారు. గుడిలో స్వామివారిని నమస్కరించుకున్న తర్వాత పరంధామయ్య మాత్రం ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.దీంతో అనసూయ ఏంటి వచ్చినప్పటి నుంచి ప్రసాదం కోసం వెతుకుతున్నారు అనడంతో ఆ ప్రసాదంతో అయినా కాస్త కడుపు నింపుకుందామని వెతుకుతున్నాను అని చెబుతాడు.
ఇక తులసి సామ్రాట్ ఇద్దరూ కూడా హనీతో గంట కొట్టించడానికి పోటీ పడుతుంటారు. అది చూసిన పూజారి ఇలా తల్లిదండ్రులు బిడ్డల పట్ల ప్రేమగా ఉండాలి అని చెప్పడంతో మేమిద్దరం భార్యాభర్తలు కాదండి ఆయన నా స్నేహితులు అంటూ తులసి చెబుతుంది.మరోవైపు అంకిత తనకు పిల్లలు లేరని లాస్య అన్న మాటలను గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉండగా అక్కడికి ప్రేమ్,శృతి దివ్య వెళ్తారు. తను అన్న మాటలను ఏమాత్రం పట్టించుకోవద్దని తన గురించి మనకు తెలిసిందే కదా అని అందరూ తనకు ధైర్యం చెబుతారు. కానీ అంకిత మాత్రం లాస్య మాటలకు ఏడుస్తూనే ఉంటుంది.
మరోవైపు పరంధామయ్య ప్రసాదం లైన్లో నిలబడి తన వంతు రాగానే ప్రసాదం పెట్టించుకుంటాడు. తనకు మరో కప్పు కావాలి అని అడగడంతో ప్రసాదం పెట్టే వ్యక్తి పరంధామయ్యతో గొడవ పడతాడు. ఇలా వీరిద్దరు గొడవ పడుతుంటే అక్కడికి అనసూయవెల్లి మరి కాస్త గొడవ పెట్టుకుంటుంది.దీంతో గుడిలోనే ఉన్నటువంటి సామ్రాట్ తులసి ఇద్దరు కూడా ఈ గొడవ చూస్తారు. అయితే అక్కడ తన మామయ్య అత్తయ్య ఉన్నారని తెలియడంతో ఒక్కసారిగా తులసి షాక్ అవుతుంది.