చివరి శ్వాస వరకు నవ్విస్తూనే ఉంటా.. ఆ చట్రంలో ఇరుక్కుపోను.. సుధీర్ కామెంట్స్ వైరల్!

సుడిగాలి సుదీర్ తాజాగా గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుధీర్ జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం అందుకొని కమెడియన్గా కొనసాగుతూ అనంతరం టీం లీడర్ గా ఎదిగారు. అదేవిధంగా యాంకర్ గా కూడా అవకాశాలను అందుకున్నారు.కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నటువంటి సుధీర్ ఏకంగా హీరోగా అవకాశాలను అందుకున్నారు.

సుధీర్ ఇదివరకు నటించిన పలు సినిమాలు విడుదలైనప్పటికీ ఏ సినిమాలు పెద్దగా ఆయనకు గుర్తింపు తీసుకురాలేదు అయితే మొదటిసారి మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఈయన నటించిన గాలోడు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సుదీర్ మాట్లాడుతూ తనకు సినిమా లెక్కలు ఏవి పెద్దగా తెలియదు కానీ తనని నమ్మి సినిమా నిర్మించిన నిర్మాత ఆ సినిమాని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.

కరోనా వంటి భయంకరమైన పరిస్థితులను చూసిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అందుకే బ్రతికున్న రోజులు ఎంతో సంతోషంగా హాయిగా నవ్వుతూ గడపాలని కోరుకుంటున్నాను అందుకే తాను వెండితెరపై అయినా బుల్లితెర పై అయినా ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. తాను హీరోగా మారిన హీరో అనే చట్రంలో ఇరుక్కుపోనని,తన ఆఖరి శ్వాస వరకు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటానని ఈ సందర్భంగా సుధీర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.