సౌర్య కోసం మొండి పట్టు పట్టిన దీప…. సౌర్యను ఇచ్చేయాలని నిర్ణయించుకున్న ఇంద్రుడు!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ ఎన్నో ట్విస్టుల నడుమ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తుంది.ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా కార్తీక్ దీపకు సర్జరీ చేయాలని ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈమె ఏదో టెన్షన్ లో ఉందని అందుకే తన బిపి కూడా నార్మల్ గా లేదని చెప్తారు. దీంతో ముందు తను సమస్యను పరిష్కరించిన తర్వాతే ఆపరేషన్ చేయాలని చెప్పగా కార్తీక్ సరే అంటాడు. అనంతరం కార్తీక్ మాట్లాడుతూ నేనే సర్జరీ చేశానని మా ఆవిడకు చెప్పద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

తనకు గతం గుర్తొచ్చిందనే విషయాన్ని చెబితే ఎగిరి గంతేస్తుంది. అయితే ఈ సమయంలో చెప్పడం మంచిది కాదు ఆపరేషన్ అయిన తర్వాత అన్ని నిదానంగా చెబుతారని మనసులో అనుకుంటాడు. మరోవైపు సౌందర్య మోనిత నుఒక చోటుకు తీసుకెళ్లి బంధిస్తుంది. నన్ను వదిలేయండి ఆంటీ అని చెప్పిన వినిపించుకోదు. నీ కొడుకుని తీసుకెళ్తే కేసు పెడతావ్ నీ ఇంటికి వస్తే తల పగలగొడతావు అసలు ఏం పెట్టావు ఇంట్లో అని అడుగుతుంది ఏం లేదు అంటే నేను వెళ్ళాలి అని చెప్పగా.. అయినా ఇక్కడ బట్టలు కొట్టు పెట్టుకోవాల్సిన కర్మ నీకేంటి నువ్వు ఇక్కడే ఉండాలి అని తనని బంధించి వెళుతుంది.

లోపల ఉన్నటువంటి మోనిత కార్తీక్ దీప ఎక్కడికి వెళ్లారు. వారికి గతం గుర్తుకు వచ్చిందని ఆలోచిస్తూ ఉండగా అయినా గతం గుర్తుకొస్తే ఎక్కడికి వెళ్తారు ఇక్కడికే కదా వస్తారు తర్వాత నా కథ మొదటి నుంచి మొదలుపెడతా అంటూ మాట్లాడుకుంటుంది.మరోవైపు దీపకు స్పృహ రాగా శౌర్య దొరికిందా అని అడుగుతుంది. ఇన్ని రోజులు దొరకనీది ఇప్పుడే దొరుకుతుందా అని డాక్టర్ బాబు చెబుతాడు. ముందు నీ ఆరోగ్యం బాగా అవ్వాలి నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా సౌర్యను చూసుకుంటావు అని చెప్పడంతో మీరు అలా మాట్లాడకండి వాళ్ళు నా కూతుర్ని తీసుకొని వాళ్లు ఎక్కడికైనా వెళ్లిపోతే అంటూ దీప బాధపడుతుంది.

నాకు ఈ ఆపరేషన్ వద్దు ఏమి వద్దు అంటూ దీప అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నం చేయగా కార్తీక్ తనపై సీరియస్ అవుతాడు.మరోవైపు ఇంద్రుడు అదే ద్యాసలు ఉండి చంద్రమ్మ ఎంత పిలిచిన పట్టించుకోడు దీంతో ఆమె తనని బయటకు తీసుకెళ్లి అసలు ఏం జరిగిందో చెప్పు అని అడగగా జరిగిన విషయం అంతా చెప్పి సౌర్యను వాళ్లకు ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను అని చెప్పగా చంద్రమ్మ కూడా ఇచ్చేద్దాం మనకు పిల్లలు లేకపోయినా నాకు నువ్వు నీకు నేను అంటూ ఎమోషనల్ అవుతారు.

ఇక శౌర్య పోస్టర్లో వేసిన ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి నీకు ఇంద్రుడు తెలుసా అని అడగా తెలియదు అని చెబుతాడు.కార్తీక్ కూడా తనని బెదిరిస్తాడు అతను పోలీసులు కేసు అని చెప్పగా తనకు నిజం చెబుదామని కార్తీక్ దగ్గరికి రాగా అక్కడికి వెళ్లిన అతను అబద్ధం చెప్పడంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు శౌర్య ఫోటో తీసుకొని వంట లక్క హాస్పిటల్ మొత్తం తిరుగుతూ అందరిని అడుగుతుంది. దీంతో ఆమెకు మరోసారి కళ్ళు తిరిగి కింద పడిపోతుండగా డాక్టర్ బాబు వచ్చి పట్టుకుంటారు.నీకు ఎన్నిసార్లు చెప్పాను బయటికి రావద్దని అంటూ సీరియస్ గా హాస్పిటల్ లో కూడా ఉండకూడదు డాక్టర్ బాబు అంటుంది. రూమ్ దాటి కూడా బయటకు రాకూడదు అంటూ కార్తీక్ సీరియస్ అవుతాడు.