Nirupam Paritala: తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు నిరుపమ్ పరిటాల. అయితే చాలామంది ప్రేక్షకులు నిరుపమ్ పరిటాల అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్ హీరో డాక్టర్ బాబు అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ ఒక్క సీరియల్ తో భారీగా పాపులారిటీని గుర్తింపును సంపాదించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన పాపులారిటీని సంపాదించుకున్నారు డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్.
కార్తీకదీపం సీరియల్ లో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న పాత్రలు ఒకటి డాక్టర్ బాబు రెండవది వంటలక్క. ఈ రెండు పాత్రలకు ప్రేక్షకులు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్స్ కి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. ఈ సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక టిఆర్పీ రేటింగ్ ను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా మరే సీరియల్ కి రాని విధంగా సీజన్ 2 ఈ సీరియల్ కు రావడం అన్నది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం అని చెప్పాలి. ఈ సినిమా కంటే ముందు ఈ సినిమా తర్వాత కొన్ని వందల సీరియల్స్ తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యాయి. కానీ ఏ సీరియల్ కూడా ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ని బీట్ చేయలేకపోయింది.
బాహుబలి కట్టప్ప ను ఎందుకు చంపాడు అనే పాయింట్ తో బాహుబలి 2 సినిమా ఎలా అయితే బ్లాక్ బస్టర్ అయిందో, వంటలక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు అన్న పాయింట్ కూడా ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ కి పెరగడానికి బాగా ప్లేస్ అయింది అని చెప్పాలి. ఇక ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం స్టార్ మా లో కార్తీకదీపం 2 ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు నిరుపమ్ పరిటాల. ఒకవైపు హీరోగా సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా పలు సీరియల్స్ లను నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా డాక్టర్ బాబు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ సమయంలో తన స్నేహితులతో సన్నిహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే డాక్టర్ బాబుని చూసినా కొంతమంది అభిమానులు అతనితో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు నిరుపమ్ పరిటాల. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.