Paritala Nirupam: పరిటాల నిరుపమ్ అంటే చాలామంది ప్రేక్షకులు గుర్తించకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు లేదా కార్తీక్ అంటే టక్కున ఈయన అందరికీ గుర్తుకు వస్తారు. చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్ ఎన్నో సీరియల్స్ చేసిన కార్తీకదీపం సీరియల్ తీసుకువచ్చినంత పేరు ప్రఖ్యాతలు గుర్తింపు ఈయనకు ఏ సీరియల్ తీసుకురాలేదని చెప్పాలి ఈ సీరియల్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన నటుడిగా మాత్రమే కాకుండా సీరియల్ నిర్మాతగా కూడా మారిపోయారు.
ఇలా నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి సీరియల్స్ చేయడమే కాకుండా నిర్మాతగా మారడం అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆదాయం అందుకుంటున్నారని తెలుస్తోంది వీటితోపాటు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బాబు ఆస్తులు రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. పలు నివేదికల ప్రకారం ఒకరోజు సీరియల్ షూటింగ్లో పాల్గొంటే నిరుపమ్ ఏకంగా 40 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. సీరియల్స్ లోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా ఈయన గుర్తింపు పొందారు.
ఇక ఈయన యూట్యూబ్ నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది అలాగే తన భార్యతో కలిసి శ్రీవల్లి కలెక్షన్స్ అంటూ వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. ఇక ఈయన గ్యారేజ్ లో కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయని తెలుస్తుంది. హైదరాబాద్లో 80 లక్షల విలువచేసే ఇంటితో పాటు వైజాగ్ లో ఐదు కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు సమాచారం ఇటీవల హైదరాబాద్ లో మరో కొత్త ఇంటిని కూడా నిర్మించబోతున్నారని ఇలా ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను డాక్టర్ బాబు దంపతులు యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ వచ్చారు ఇక ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.
