‘సైరా’కి రాహుల్ గాంధీకి లింకేమిటి?

 
 (సూర్యం)

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందతున్న సినిమా ఇది. చిరు తనయుడు రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్ కం‍పెనీ బ్యానర్‌పై దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వేసవికి విడుదల చేయాలనే పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. అయితే ఎలక్షన్ వాతావరణ ఆ ఆలోచనకు గండి కొట్టేలా కనపడుతోంది.

 

కాంగ్రేస్  తమ పార్టీకి స్టార్ కాంపైనర్ గా చిరంజీవిని భావించి తెలంగాణాలో ప్రచారానికి పంపే అవకాసం కనపడుతోంది. ఖైదీ నెంబర్ 150 తన ఫ్యాన్ బేస్ చెక్కు చెదరలేదని ప్రూవ్ చేసిన ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ క్యాంపైన్ లో ఉపయోగపడతారని కాంగ్రేస్ భావించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దాంతో రాహుల్ గాంధీ పర్శనల్ గా  ఫోన్ చేసి తెలంగాణా అసెంబ్లీ ఎలక్షన్స్  ప్రచారంలో చిరు సాయం అడుగుతారని భావిస్తున్నారు. ఎందుకంటే రాహుల్ మరియు తెలంగాణా కాంగ్రేస్..ఈ ఎలక్షన్స్ ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించి సీరియస్ గా తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతానికి చిరంజీవిని మించిన స్టార్ క్యాంపెయిన్ లేరు.  చిరంజీవిని స్టార్ క్యాంపెయిన్ చేస్తే సభలకు పెద్ద ఎత్తున జనం వస్తారు. కాంగ్రెస్ కు అందుబాటులో ఉన్న మరొక ‘స్టార్’ క్యాంపెయినర్ విజయశాంతి. ఆమె ఇపుడు మూవీ స్టార్ కాదు. పొలిటిషయన్.  జోష్ మీద ఉన్న స్టార్ చిరంజీవియే. అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ చిరంజీవిని కొన్ని సభల్లోనైనా క్యాంపెయిన్ చేయమని అడిగే అవకాశం ఉంది.

 

ఇప్పటికే తెలంగాణా కాంగ్రేస్ లీడర్స్ …పార్టీ లీడర్స్ పై చిరంజీవిని పార్టీ క్యాంపైన్ ని ఎట్టిపరిస్దితుల్లోనూ తీసుకురావాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎలాగోలా పార్టీ ఒత్తిడిని తట్టుకుని తన సినిమా షూటింగ్ ని నిర్విఘ్నంగా చేసుకువెళ్లగలిగారు. కానీ తెలంగాణా ఎలక్షన్స్ సమయంలో అది సాధ్యమయ్యేలా కనపడటం లేదు అంటున్నారు. 

 

 మరి చిరంజీవి పొలిటికల్ క్యాంపైన్ కు వెళ్ళితే ఖచ్చితంగా షెడ్యూల్స్ అప్ సెట్ అవుతాయి. ఈ సినిమాలో అందరూ దాదాపు బిజిగా ఉండే ఆర్టిస్ట్ లు నటిస్తున్నారు . దాంతో వారి కాంబినేషన్ లో మళ్లి సెట్ అవ్వాలంటే టైమ్ పడుతుంది. ఇప్పుడు బాల్ చిరంజీవి కోర్ట్ లో ఉంది. ఎలా చిరంజీవి మ్యానేజ్ చేసి బయిటపడతారో చూడాలి. 

 

 

ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. నయనతార, చిరు సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది ఈ భారీ చారిత్రక చిత్రాన్ని సంగీతమందిస్తున్నారు. 

 

 నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ జార్జియాలో జరగనుందని టాక్‌.