రాహుల్ గాంధీని కేసీఆర్ బఫూన్ అనడం కరెక్టే : టిఆర్ఎస్ ఎంపీ కవిత

తెలంగాణ సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పే లేదని ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్దించారు. ఇంకా ఆమె ఏం అన్నారంటే..

“కేసీఆర్ రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పు లేదు. సిల్లిగ ప్రవర్తించే వారిని బఫూన్ అనకుండా ఇంకేం అంటారు. ప్రతిపక్ష నేత పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించి దేశ ప్రధానిని సభలో ఎలా హత్తుకున్నారో దేశ ప్రజలంతా చూశారు. సిల్లిగా ప్రవర్తించే వారిని బఫూన్ అనడంలో తప్పే లేదు. రాహూల్ గాంధీ నిజంగా బఫూనే.  

దేశ రాజకీయాలల్లో మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. మా ఎజెండా దేశ ప్రజల కోసం పని చేయడం కోసం పార్టీల కోసం కాదు. దేశంలో అనేక రాజకీయ కూటములు ఉన్నాయి. కొన్ని మాత్రమే విజయం సాధించాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. దేశ రాజకీయాలలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తీసుకొస్తున్నారు.   

New Delhi: Congress President Rahul Gandhi addresses the crowd during a protest over SC/ST atrocities bill, at Jantar-Mantar in New Delhi on Thursday, Aug 9, 2018. (PTI Photo/Ravi Choudhary) (PTI8_9_2018_000100B)

రాహుల్ గాంధీ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన రాజకీయ కూటమిలో టిఆర్ఎస్ లేదు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న స్ధానిక‌ పార్టీల జాబితాలో మేము ఉన్నాం. ఒక అభ్యర్థి ప్రధాని కావడం,  ఒక పార్టీ అధికారం లోకి రావడం కాదు. దేశ ప్రజల‌ సమస్యలను పరిష్కరించడం ముఖ్యం. తెలంగాణలో ప్రజా సమస్యలు పరిష్కరించాం. జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఫైడరల్ ఫ్రంట్ పాత్ర ఉంటుంది. 

నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ భారీ విజయాలేమీ సాధించలేదు. పెద్ద కాంగ్రెస్ గా కాదు చిన్న కాంగ్రెస్ గానే‌ కాంగ్రెస్ పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లో స్దానిక పార్టీలు పెద్ద పాత్ర పోషించాయి. జాతీయ రాజకీయాలలో ప్రజలకు దగ్గరగా ఉండే స్దానిక పార్టీలు పెద్ద పాత్ర పోషిస్తాయి. కాంగ్రెస్ బిజెపియేతర పార్టీలతో కలిసి పనిచేస్తాం. ఎన్డీఏ కూటమికి టిఆర్ఎస్ టీమ్ బి గా లేదు.. భారత ప్రజల టీమ్ గా టార్ ఎస్ ఫెడరల్ ఫ్రంట్ ఉండబోతుంది” అని కవిత అన్నారు.