పెద్ద హీరోలకు టైటిల్ పెట్టడం కూడా పెద్ద యజ్ఞమే. ఎందుకంటే టైటిల్ క్యాచీగా ఉండకపోయినా సమస్యే. అలాగే ఏ మాత్రం కొంచెం యావరేజ్ గా ఉన్నా మిగతా హీరోల ఫ్యాన్స్ మోసేస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టైటిల్ ని ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు ప్రభాస్ అదే టెన్షన్ లో ఉన్నారట. ఆయన జిల్ రాధాకృష్ణతో చేస్తున్న చిత్రం కు ఏం టైటిల్ పెట్టాలన్న దిసలో కసరత్తులు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం రెండు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ‘అమూర్’ అనే ఫ్రెంచ్ పదం టైటిల్‌గా పరిశీలిస్తున్నారు. అమూర్ అంటే ప్రేమ అని అర్థం అని తెలుస్తోంది. అలాగే… ‘జాన్’ అనే మరో పేరు కూడా పరిశీలనలో ఉంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. హిందీ ప్రేక్షకులకూ, తెలుగువాళ్లకీ అర్థమయ్యేలా ఒకే టైటిల్‌ని ఖరారు చేయాలన్నది చిత్ర యూనిట్ ఆలోచన గా చెప్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్.
రాజమౌళి తో ప్రతిష్టాత్మకంగా చేసిన ‘బాహుబలి 2’ఘన విజయం తరవాత ప్రభాస్ సినిమా ఏదీ ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ప్రభాస్ తో పాటు బాహుబలిలో చేసిన రానా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ మాత్రం మెల్లిగా ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసి, పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే అభిమానులు మాత్రం ఎప్పుడు తమ హీరో చిత్రం అంటూ ఎదురుచూపుల్లో ఉన్నారు. ఇది గమనించిన ప్రభాస్.. ఒకేసారి రెండు చిత్రాల్ని పూర్తి చేసి అభిమానులకు డబుల్ బొనాంజా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్.