డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం పెండింగ్ చిత్రీకరణకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 30శాతం షూటింగ్ పెండింగ్ ఉందని ఇటీవల రాధాకృష్ణ వెల్లడించారు. అనంతరం మహమ్మారీ నిర్భంధనం వల్ల వాయిదా పడింది. ఈ వారం నుంచి షూటింగులకు ప్రభుత్వ అనుమతులు లభించినందున ఈ సినిమా పెండింగ్ చిత్రీకరణను వేగంగా పూర్తి చేయనున్నారని సమాచారం. ఇప్పటికే యూరప్ లొకేషన్ ని హైదరాబాద్ లోనే సెట్స్ వేస్తున్నారన్న ప్రచారం సాగింది.
ఇక తొలి వారంలోనే టైటిల్ ప్రకటన ఉంటుందన్న గుసగుస కూడా వినిపిస్తోంది. జాన్ .. రాధే శ్యామ్ .. ఓ డియర్ టైటిల్స్ వినిపిస్తున్నాయి. వీటిలో ఏదో ఒకటి కన్ఫామ్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ – గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇందులో ప్రభాస్ రిచ్ గయ్ గా కనిపిస్తే పూజా మాత్రం యూరప్ లో బొమ్మలు అమ్ముకునే పేద యువతిగా కనిపించనుంది.
రిచ్ కిడ్ – పూర్ గాళ్ లవ్ స్టోరీ ఇదన్న ప్రచారం సాగింది. ఇక ఇందులో పాత కాలం నాటి సెటప్ .. నాటి అంబాసిడర్ కార్లు వగైరా వగైరా స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాయన్న ప్రచారం సాగింది. మరి ఈ సినిమా కథేంటి? అన్నది టైటిల్ లాంచ్ సందర్భంగా రివీల్ చేస్తారా? అన్నది చూడాలి.