సాహో తర్వాత అంచనాలు పీక్స్
డార్లింగ్ ప్రభాస్ నుంచి ఓ సినిమా వస్తోంది అంటే దానిపై కచ్ఛితంగా పాన్ ఇండియా స్థాయి అంచనాలు తప్పనిసరి. ఇలాంటి సమయంలో అతడు ఒక సాధా సీదా స్క్రిప్టును ఎంపిక చేసుకున్నా.. లేదా అంచనాల్ని అందుకోలేని చెత్త కంటెంట్ ని ప్రదర్శించినా ఫలితం అంతే దారుణంగా ఉండే ఛాన్సుంటుంది. సాహో విషయంలో జరిగిన తప్పిదమే ఇది. ఎంతో భారీ కాన్వాసుతో భారీ అంచనాల నడుమ అన్ని భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం బాహుబలిని మించి విజయం సాధిస్తుందనే భావించారు. కానీ డార్లింగ్ టీమ్ అనుకున్నది వేరు.. జరిగింది వేరు. ప్రభాస్ ఆశించినది జరగలేదు. అందుకే పెట్టుబడుల్ని తిరిగి తేలేకపోయారు. చివరికి స్వయంగా రిస్క్ చేసి ప్రభాస్ అప్పులు తీర్చాల్సి వచ్చిందని ప్రచారం సాగింది.
అందుకే ఇప్పుడు ప్రభాస్ 20 రిలీజ్ పై ఒకటే ఉత్కంఠ. రాధా కృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రంపై ఎలాంటి అప్‌డేట్ విడుదల చేయకుండా ప్రభాస్ ఇంతకాలం తన అభిమానులను కలవరపెట్టాడు. ఒక ప్రకటన చేయాలి అంటేనే అతనిపై చాలా ఒత్తిడి తప్పలేదు. అయితే ఇన్నాళ్లు వేచి చూసినందుకు ప్రభాస్ టీమ్ వ్యూహాలు పనిచేసినట్టే కనిపిస్తోంది. మహమ్మారీ లాక్ డౌన్ ఉన్నా ఎంతో పట్టుదలగా సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న పంతం ప్రభాస్ టీమ్ లో కనిపిస్తోంది.
ఎట్టకేలకు డార్లింగ్ తన సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల 10న ఉదయం 10 గంటలకు లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే అదే రోజు టైటిల్ ని ప్రకటిస్తారు కాబట్టి ఎగ్జయిట్ మెంట్ మరింతగా పెంచే వీలుంటుంది. ఈ మెగా- ఈవెంట్ అతని విశ్వసనీయ అభిమానులను సూపర్ కూల్ చేస్తుందనే అంచనా వేస్తున్నారు.
టైటిల్ లోగో తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఉంటుంది. ప్రభాస్ ఒక ఛాలెంజింగ్ పాన్ ఇండియా స్టార్ .. అందుకు తగ్గట్టే ప్రతిదీ సస్పెన్స్ ను మెయింటెయిన్ చేసినా ఎట్టకేలకు టైటిల్ సస్పెన్స్ కు తెర దించేయాలని మేకర్స్ నిర్ణయించిన తీరుతో చాలా మంది సంతోషంగా ఉన్నారు. కేవలం టైటిల్ లాంచ్ చేస్తే సరిపోదు. ఆ తర్వాత కాంపిటీషన్ లో ఉన్న ఆర్.ఆర్.ఆర్ ని మించిన అప్పీల్ తో టీజర్లు.. ట్రైలర్లు ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తారు. దానికి తగ్గట్టే యువి క్రియేషన్స్ బృందం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రీలుక్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. మరో 24 గంటల తర్వాత సస్పెన్స్ పూర్తిగా వీడనుంది. అంతవరకూ జస్ట్ వెయిట్..