దసరా రోజున ఫుల్ గా డ్యాన్స్ చేయడానికి ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ గా ఉండండి .. మైండ్ బ్లోయింగ్ న్యూస్

good news for prabhas fans
good news for prabhas fans
good news for prabhas fans

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇమేజ్‌కు తగినట్లుగానే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన తర్వాత నాగ అశ్విన్‌తో, అనంతరం ఓం రావుత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ సినిమాలు లైన్లో పెట్టాడు. అయితే రాధేశ్యామ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్‌లుక్ తప్ప ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ చెందుతున్నారు. ఆయన సినిమాలకు సంబంధించి దసరాకు అప్‌డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

good news for prabhas fans

కనీసం దసరా పండుగకైనా ‘రాధేశ్యామ్’ టీమ్ అప్‌డేట్ ఇస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23), దసరా పండుగలకు కలిపి ఒకేసారి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసా ‘రాధేశ్యామ్’ టీజర్. దీనికి తోడు నాగ్‌అశ్విన్ సినిమాతో పాటు, ఆదిపురుష్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా రానున్నట్లు సమాచారం.

దీంతో తమ హీరోకి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవని ఫీలవుతున్న ఫ్యాన్స్‌కు ప్రభాస్ త్రిపుల్ ధమాకా ఇవ్వనున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్.ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు అక్టోబర్ నెలలో చాలా పండగలు ఉంటాయన్నమాట!