ఇండస్ట్రీ టాక్ : పాన్ ఇండియా లెవెల్లో పవన్ సక్సెస్ కాబోతున్నాడా?

accident happened in Veeramallu sets

ఇప్పుడు తెలుగు సినిమా నుంచి ఫలితాలతో సంబంధం లేకున్నా ప్రతి హీరో నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి వాటిలో కొన్ని అనౌన్స్ అయ్యి కూడా రిలీజ్ కానివి ఉన్నాయి అలాగే లాస్ట్ మినిట్ లో హిందీ రిలీజ్ లు కూడా ఆపుకున్నవి ఉన్నాయి.

అయితే మన టాలీవుడ్ స్టార్ హీరోలు పరిస్థితి చూస్తే అందరికీ ఒకేలా లేదని చెప్పాలి. ఎప్పుడో తెలుగులో చిరు నాగ్ వెంకీ మామ లు బాలీవుడ్ లోకి వెళ్ళారు కానీ మళ్ళీ మన దగ్గర మాత్రమే శ్రద్ధ చూపారు. అయితే ఇక మహేష్ పవన్ లాంటి హీరోల కి అయితే ఎపుడు నుంచో చూడాలి అనుకున్నారు.

వారిలో పవన్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ తో హిందీలోకి కూడా వెళ్ళాడు కానీ సినిమా మన దగ్గరే నచ్చకపోవడంతో అక్కడ కూడా ఈ సినిమా ఆడలేదు. దీనితో పవన్ మళ్ళీ పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వలేదు. ఇక మళ్ళీ రీసెంట్ గా భీమ్లా నాయక్ తో వెళ్లాల్సి ఉంది కానీ అది లాస్ట్ మినిట్ లో ఆగింది.

అయితే ఈసారి మాత్రం పవన్ పాన్ ఇండియా ఎంట్రీ గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. లేటెస్ట్ గా తాను చేస్తున్న పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” నుంచి వచ్చిన టీజర్ తో సినిమాపై అందరిలో ఒక కన్ను పడింది అట.

ముఖ్యంగా హిందీ, తమిళ్ నుంచి సినిమా నిర్మాతలకి మంచి ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయట. దీనితో అయితే పవన్ పాన్ ఇండియా ఎంట్రీ మాత్రం గట్టిగానే ఉంటుంది అని సినీ వర్గాల వారు అంటున్నారు. మరి ఈ సినిమా అయితే ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.