Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది. ఈ సినిమా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సెట్స్ పై ఉంటూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత రాత్రి నుంచి ప్రీమియర్ షోలు వేయటంతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకొని ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. ఇక ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథను తన వద్దకు తీసుకువచ్చినప్పుడు నాలుగున్నర గంటలపాటు నిడివి ఉందని పవన్ కళ్యాణ్ ఇటీవల తెలిపారు.
ఇలా ఎక్కువ నిడివి ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురావాలనే ఆలోచన చేసినట్లు తెలిపారు. ఇక తాజాగా మొదటి భాగం హరిహర వీరమల్లు పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో హరిహర వీరమల్లు సీక్వెల్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు ఇక ఈ సినిమాకు “యుద్ధభూమి” అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలియజేశారు.
హరిహర వీరమల్లులో కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు ఢిల్లీ బయలుదేరగా.. అడ్డుకునేందుకు ఔరంగజేబు సిద్ధమవుతారు. ఇక, వీరమల్లు, ఔరంగజేబు కలుసుకోవడంతోనే మూవీని ముగించారు. అంతేకాకుండా సినిమా చివర్లో ‘యుద్ధభూమి’ అనే నేమ్ కార్డుతో అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ పార్ట్-2 పై అంచనాలు పెంచారు. అయితే పార్ట్ టు సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు అయితే ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకుందని ఇటీవల పవన్ కళ్యాణ్ తెలియచేశారు. అయితే ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అదేవిధంగా తనకు సమయం కుదిరినప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అందుకు భగవంతుడు ఆశీస్సులు కూడా కావాలని తెలియజేశారు.
