HHVM: పవన్ సినిమాలు వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్… ఇబ్బందులు తప్పవా?

HHVM: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాపై ఎక్కడా నెగిటివిటీ రాకుండా దర్శక నిర్మాతలు మొదటి నుంచి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాని ముందుకు నడిపిస్తున్నారు.

ఇలా అంత సవ్యంగా సాగిపోతుందనుకునే సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఒక బ్యాడ్ సెంటిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదలయితే బాగుంటుందని ఎంతో మంది దర్శక నిర్మాతలు శుక్రవారం తమ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా మాత్రం గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఆరోజు అమావాస్య కావడంతో అభిమానులు కాస్త ఆందోళనలకు గురి అవుతున్నారు.

మన తెలుగు రాష్ట్రాలలో అమావాస్యను చెడుకు సంకేతంగా భావిస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలను మంచి పనులను కూడా మొదలుపెట్టరు అలాంటిది పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు సినిమాని ఎందుకు అమావాస్య రోజు విడుదల చేస్తున్నారనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా అమావాస్య రోజున ఈ సినిమా విడుదలకావడం దేనికి సంకేతం ఇలా విడుదల కావడంతో కలెక్షన్ల పై ప్రభావం చూపించనుందా అంటూ ఎంతో మంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం ఈ సినిమాని విడుదల చేయటం వల్ల లాంగ్ వీకెండ్ ఉంటుందన్న ఒక కారణంతోనే చిత్ర బృందం గురువారం ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది కానీ అభిమానులు మాత్రం అమావాస్య రోజున విడుదల చేయడంతో ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిబ్యాడ్ సెంటిమెంట్ ను పవన్ కళ్యాణ్ తన క్రేజ్ తో తుడిచేస్తారా లేకపోతే ఇబ్బందులను ఎదుర్కొంటారా అనేది తెలియాల్సి ఉంది.