ఊహించని లెవెల్లో ఏక్షన్ తో దూసుకొచ్చిన “హరిహర వీరమల్లు” సాలీడ్ టీజర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అసలైన పాన్ ఇండియా ఎంట్రీ ఖచ్చితంగా “హరిహర వీరమల్లు” గట్టిగానే ఉండేలా ఉందని చెప్పి తీరాల్సిందే. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో పవర్ స్టార్ ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యి చేసిన ఈ సినిమా సుమారు 50 శాతం పూర్తయ్యింది.

అయితే ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా మేకర్స్ మాత్రం భారీ ట్రీట్ లనే ప్లాన్ చేశారు. నిన్ననే ఒక ఊహించని పోస్టర్ ని రిలీజ్ చెయ్యగా ఈరోజు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవర్ గ్లాన్స్ అదే టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఇది చూసాక అయితే పాన్ ఇండియా లెవెల్లో పవన్ తీసుకున్న ఈ భారీ స్టెప్ హిట్ అయ్యేలాగే కనిపిస్తుందని చెప్పాలి.

పవన్ లోని రాయల్ లుక్ తో ఆ మీసకట్టు పహిల్వాన్ లను పడగొట్టి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అన్నీ కూడా వేరే స్థాయిలో ఉన్నాయి. అసలు పవన్ నుంచి అయితే ఈ లెవెల్ ఏక్షన్ ని ఎవరూ కూడా ఊహించి ఉండకపోవచ్చు.

దీనితో పాటుగా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూపిస్తుంది. అలాగే సినిమాలో భారీ సెట్టింగ్ లు గ్రాండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో అయితే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ఈ టీజర్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు. 
#HariHaraVeeraMallu - Power Glance | Pawan Kalyan | Krish | MM Keeravaani | AM Rathnam