నిన్న పవన్ ధరించిన షూ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎట్టకేలకు సినిమాలపై ద్రుష్టి పెట్టడం అభిమానులకి ఆనందంగా ఇప్పుడు మారింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం ఏకంగా వర్క్ షాప్స్ లో కూడా పవన్ ఇప్పుడు పాల్గొనడం ఆసక్తిగా మారింది.

ఇక ఇదిలా ఉండగా నిన్ననే ఈ అంశంపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ని అందించగా తాను నిన్న వేసుకున్న షూ కోసం అయితే అభిమానుల్లో టాపిక్ వచ్చింది. మరి అలా ఆ బూట్ల కోసం ఇంటర్నెట్ లో వెతకగా అలా చూసిన వారికి ఆ బూట్ల ధర చూసి షాక్ తగిలింది.

మహా అయితే బూట్లలో భారీ ధర అంటే ఒక లక్ష అంటేనే అది కళ్ళు తిరిగే ధర కానీ నిన్న పవన్ వేసుకున్న షూ ధర అయితే ఏంటంటే.. ఏకంగా అక్షరాలా 12 లక్షల 64 వేలు అంట. దీనితో ఈ రేట్ చూసిన ఫ్యాన్స్ షాకవుతూ దీని కోసం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

మరి ఒక్క షూ ధరే పన్నెండున్నర లక్షలు అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని అనుకున్నట్టే అక్టోబర్ మధ్య నుంచే స్టార్ట్ చేయనున్నారట. నిన్న వర్క్ షాప్ లో అయితే హీరోయిన్ నిధి అగర్వాల్, సునీల్ లు కూడా కనిపించారు.