‘ఎన్టీయార్ కథానాయకుడు’ క్విక్ మూవీ రివ్యూ…

అనుకున్నట్లుగానే ‘ఎన్టీయార్ కథానాయకుడు’ రాజకీయవాసన వేయడం లేదు. వివాదాలకు దూరంగా ఉంది. అని పూర్తిగా రాజకీయాల్లేవు అనడానికి వీల్లేదు. రాజకీయాలకు ఇందులో బీజం పడింది. చాలా జాగ్రత్తగా చూస్తేనే ఇది అర్థమవుతుంది. నాకు సినిమాలకంటే జనం ముఖ్యం అని ఎన్టీరామ ారావు అనడం మొదటి భాగంలో కనిపిస్తుంది. ఇక్కడే రెండో భాగానికి అంటే ఎన్టీయార్ మహానాయకుడు చిత్రానికి అంకురార్పణ జరిగింది.

చిత్రంలో మూడు అద్భుతమయిన ఘట్టాలున్నాయి. అవి రాయలసీమ కరవు. సీతారామకల్యాణం షూటింగ్, పెద్దకొడుకు మరణం. ఈ మూడు ఇంటర్వెల్ ముందున్న గొప్ప సంఘటనలు. ఎన్టీరామ ారావు పర్సనాలిటిని ఎలా మలిచాయో క్రిష్ చాాలా చాలా చాలా గొప్పగా చిత్రీకరించారు

#రాయలసీమ కరువు సమయంలో ఎన్టీయార్ జోలె పట్టుకుని కరువు సహాయానికి బయలు దేరతారు. అపుడు నాగిరెడి చక్రపాణిల దగ్గిర ఆయన నాలుగు సినిమాలు ఒప్పకున్నారు. కరువు సహాయం తీసుకువచ్చి ప్రభుత్వానికి అందించమనినాగిరెడ్డిని కోరుతారు. నాగిరెడ్డి కి కోపం వస్తుంది. ఇలా జోలె పట్టుకుని జనంలోకి వీలితే, నటుడిగా ఎన్టీయార్ కు ఉన్న మిస్టిక్ఎలిమెంట్ పోతుంది,నిన్ను చూశాక, నీ సినిమాలెవరు చూస్తారని కోప్పడతారు. ఎన్టీయర్ అంగీకరించరు. జనం తనకు ముఖ్య మని సినిమాలు రద్దు చేసుకుని వెళ్లిపోతారు

#రెండోది  సీతారామ కల్యాణంలో ఒక సారి 20 గంటల షూటింగ్ చేయాలి. దీనిని తట్టుకునిలవాలి

#మూడోది ఎన్టీయార్ పెద్ద కొడుకు చనిపోవడం. దీనిని చాలా గొప్పగా చిత్రీకరించారు. ఈ అవేదనను భరించడాని ఆయన ఎక్కువ పనిచేయాలనుకుంటాడు. ఎంత ఎక్కువ అంటే కొడుకు మరణం వార్త విషాదం గుర్తుండనే రాదు. దీనిని క్రిష్ కదిలించేలా చేశాడు.

ఇక, నటుడిగా బాలకృష్ణని , ధీరోదాత్త కథానాయకుడిగా ఎన్టీ యార్ ను హైలెట్ చేయడంలో క్రిష్ విజయవంతమయ్యారు.

1984 మద్రాస్ లో ఎన్టీరామారావు భార్య బసవతారకం వైద్యచికిత్సతో ఎన్టీయార్ బయోపిక్ మొదటి భాగం మొదలయింది.

సినిమా 1947 ఫ్లాష్ బాక్ కి మారడం,రిజిస్ట్రా ర్ గా ఉన్న ఎన్టీయార్ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. ఆరోజుల్లో చాలా మందిలాగే సినిమా అవకాశాల కోసం అన్వేషణ మొదలవుతుంది.

అన్ని సీన్లు ఆధీమ్ లో చక్కగా ఒదిగాయి. ఉదాహరణకి అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఏ మాత్రం నిర్లక్ష్యానకి గురి కాలేదు. క్రిష్ ఈ సెన్సిటివ్ విషయంలో అద్భుతమయిన బ్యాలెన్స్ మెయింటెన్ చేశారనక తప్పదు. ఇదే విధంగా ఏమోషన్స్ క్రియోట్ చేయడంలో క్రిష్ విజయవంతమయ్యారు.

ఎన్టీయార్ పెద్ద కొడుకు మరణం సీన్. ఇది చూసి తీరాల్సిందే. ఇక్కడ మహానటి  ప్రభావం కనిపిస్తుంది.

పాత సినిమాల సీన్స్ కూడా బాగా అతికాయి. దానవీరశూరకర్ణ, అరోజుల్లో ప్రేక్షకులను ఉర్రూత లూగించిన యమగోల, అడవిరాముడు లపాటలతో సీరియస్ సినిమాలో సగటు ప్రేక్షకుడిని అలరించాలనుకోవడం క్రిష్ నేర్పరి తనానికి నిదర్శనం. ఏన్టీయార్ కథనాయకుడులో రాజకీయాలు లేవనుకోవడానికి వీల్లేదు. సినిమా ముగిసేది తెలుగుదేశం పార్టీ అవిర్భావ ప్రకటనతోనే. చంద్రబాబు కూడా ఈ పార్ట్ లోనే ఎంటరవుతారు.

ఎన్టీరామారావు సినిమాహీరో ఎన్టీయార్ కావడం అక్కడి నుంచి సుదీర్ఘ చిత్రయాత్ర నుంచి రాజకీయ యాత్రలలోకి వెళ్లడం… ఈ ఎవల్యూషన్ ని చక్కగా చూపించారు. ఇందులో క్రిష్ విజయవంతమయ్యారనక తప్పదు.

హాట్సాఫ్ క్రిష్

(సమగ్రమయిన రివ్యూ కొద్ది సేపట్లో వస్తుంది)