మెగాస్టార్ కి తలనొప్పిగా మారుతున్న ‘మా’ ఎన్నికలు ?

'MAA' elections becoming a headache for Megastar?

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (మా)’ ఎన్నికలు దాదాపు అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో రసవత్తరంగా జరుగుతుంటాయి. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ… కొట్లాడుకుంటూ… ఎన్నికల వేడిని తారా స్థాయికి తీసుకెళతారు. ఎన్నిక పూర్తవగానే ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ఎన్ని జరిగినా సినిమా వారంతా చివరికి అన్నదమ్ములమే అని ఇచ్చే ఫినిషింగ్ టచ్ తో అప్పటివరకు కుతుహులంతో చూసిన సామాన్య ప్రజలకి ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి… ఇంతోటి దానికా ఇంత సినిమా చూపించారు అని అవాక్కవుతారు.

'MAA' elections becoming a headache for Megastar?

ఇప్పుడు ఆ గోల ఎందుకు అనుకుంటున్నారా…! త్వరలోనే ‘మా’ అసోసియేష‌న్‌ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను మా ఎన్నికలలో అధ్యక్షుని పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తనకి ఉందన్నట్లుగా మాట్లాడటం కూడా జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇవ్వటం జరిగింది. ప్రకాష్ రాజ్ తెలుగులో వందలాది సినిమాలు చేయటంతో తెలుగు నటీ నటులతో మంచి సాన్నిత్యం ఉండడటంతో గట్టి అభ్యర్థిగా అంతా భావించారు. అయితే ఊహించని విధంగా రేస్ లోకి మంచు విష్ణు రావటంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

మంచు ఫ్యామిలీకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖలందరితోనూ మంచి సత్సంబంధాలున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ బాగా సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ తో కలిసి చిరంజీవి ఎన్నో సినిమాలు చేసిన పరిచయంతో వీరిద్దరూ కూడా మంచి స్నేహితులుగా మెలుగుగుతున్నారు. దీంతో ఇప్పుడు చిరంజీవి ఎవరి వైపు ఉంటారో అన్న సందేహం పరిశ్రమ వర్గాలలో రేకెత్తుతుందట. మరోవైపు మెగాస్టార్ కూడా ఏం చెయ్యాలో అర్ధంకాని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారని సన్నిహితులు ద్వారా తెలుస్తుంది. చివరికి మా ఎన్నికలు చిరంజీవికి తలనొప్పిగా మారబోతున్నాయన్నమాట .