ఓవైపు సినిమాలు.. మరోవైపు K- బ్యూటీ సౌందర్య సాధన ఉత్పత్తుల వ్యాపారం.. ఇంకోవైపు భారీగా కార్పొరెట్ బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ కత్రిన సంపాదిస్తున్నది ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే. ఈ బ్యూటీ ఏడాదికి సుమారుగా 30-40 కోట్ల మేర ఆర్జిస్తోందన్నది ఓ నివేదిక. 2017 లో దాదాపు 30 కోట్ల మార్క్ సంపాదనతో ఫోర్బ్స్ జాబితాలో చేరిన ఈ బ్యూటీ ఆదాయం అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు.
2020లో వరుస ప్రాజెక్టులతో కత్రిన బిజీ బిజీ. ఓవైపు విక్కీ కౌశల్ సరసన ఓ చిత్రంటో నటిస్తోంది. మరోవైపు సల్మాన్ భాయ్ సరసన మరో సినిమాకి కమిటైంది. టైగర్ ఫ్రాంఛైజీలో మూడో సినిమాకి ప్రస్తుతం ఆదిత్య చోప్రా సన్నాహకాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇందులో సల్మాన్ భాయ్ సరసన కత్రిన నటించనుంది. ఇక ఈ జోడీ నటించిన ఏక్ థా టైగర్.. టైగర్ జిందా హై ఎంతటి సంచలన విజయం సాధించాయో తెలిసినదే.
టైగర్ 3 చిత్రాన్ని ఫిబ్రవరి 2021 లో ప్రారంభించి 8 నెలల షెడ్యూల్ లో ఏకధాటిగా పూర్తి చేస్తారట. అప్పటికి సల్మాన్ సిక్ ప్యాక్ యాబ్స్ .. హెవీ బైసెప్స్ తో భాయ్ సందడి చేస్తాడని సమాచారం. ఇప్పటికే లాక్ డౌన్ లో భారీగా కండలు పెంచాడు. ఇక టైగర్ పాత్ర లార్జర్ దేన్ లైఫ్ తరహాలో ఉండే అవకాశం ఉందట. ఇక కత్రిన పాత్ర టైగర్ జిందా హై కి కొనసాగింపుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సల్మాన్ రాధే చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు కత్రిన కెరీర్ ఇప్పటికే పదిహేనేళ్లు పూర్తయింది. ఈ అమ్మడు అల్లరి పిడుగు లాంటి డిజాస్టర్ లో నటించాక తెలుగు చిత్ర సీమ వైపు చూడలేదు. పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైన సంగతి తెలిసిందే. మల్లీశ్వరి చిత్రంతో కత్రిన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక బ్రాండ్స్ పరంగా చూస్తే కత్రిన నిరంతరం కోట్లలో ఆర్జిస్తోంది. సోషల్ మీడియాలో కే – బ్యూటీ ఉత్పత్తుల్ని ఓ రేంజులోనే ప్రమోట్ చేస్తోంది.