Aamir Khan: ఆమిర్ ఖాన్ జీవితంలోకి మరో ప్రేయసి.. ఆమెకు ఓ కొడుకు కూడా..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి ప్రేమలో పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన 60వ పుట్టినరోజున ప్రైవేట్ సమావేశంలో ఆయన గౌరీ స్ప్రాట్ అనే మహిళను తన గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా ఈ వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నా, ఇప్పుడు ఆమిర్ స్వయంగా ధృవీకరించడం హాట్ టాపిక్‌గా మారింది.

గత 18 నెలలుగా గౌరీతో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పిన ఆమిర్, ఆమెకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడని వెల్లడించారు. తన పిల్లలు జునైద్, ఇరా ఖాన్ కూడా గౌరీను కలిసారని, వాళ్లకు ఆమెతో మంచి అనుభూతి కలిగిందని తెలిపారు. అయితే పెళ్లి గురించి ప్రత్యేకంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఈ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా కొనసాగుతోందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఆమిర్ తన గర్ల్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ కంటే అందంగా ఉంటుందని చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాను గౌరీతో ఉన్నప్పుడల్లా ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందని చెప్పిన ఆమిర్, ఇది తన జీవితంలో ప్రత్యేకమైన ఫేజ్ అని తెలిపారు. ఈ విషయమై బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ వార్తలతో బాలీవుడ్‌లో మళ్లీ ఆమిర్ ఖాన్ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. తన లగాన్ సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ, ‘‘భువన్‌కు అతని గౌరీ లభించింది’’ అని సరదాగా వ్యాఖ్యానించడంతో ఈ వార్త మరింత వైరల్ అయింది. గౌరీ ఇప్పటికే బెంగళూరు నుంచి ముంబైకి మకాం మార్చిందని సమాచారం. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటుందా లేదా ఇలా రిలేషన్‌షిప్‌గా కొనసాగుతుందా? అనేది ఆసక్తిగా మారింది.

Public EXPOSED: Pawan Kalyan Pithapuram Meeting || Ap Public Talk || Chandrababu || Ys Jagan || TR