ఆ శుభవార్త ముందే పంచుకుంటా: విక్కీ కౌశల్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్‌ స్పందించారు. తన కొత్త చిత్రం ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్‌ గురించి మాట్లాడారు. ‘అలాంటి శుభవార్త ఉంటే మేమే స్వయంగా విూతో పంచుకుంటాం. సరైన సమయం వచ్చినప్పుడు మేం ఆ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడం’ అని చెప్పారు.

ఇక పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పులపై విక్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెళ్లి తర్వాత ప్రతిఒక్కరిలో మార్పు వస్తుంది. మరో వ్యక్తితో కలిసి జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం. అప్పటివరకు మన కోసం ఆలోచిస్తాం.. వివాహం అనంతరం ఇద్దరి గురించి ఆలోచించాలి. ప్రతీ నిర్ణయం ఇద్దరికీ అనుగుణంగా తీసుకోవాలి. నా 36 ఏళ్ల జీవితంలో మొదటి 33 ఏళ్ల కంటే గత రెండున్నరేళ్లలోనే ఎంతో ఉన్నతంగా ఆలోచించడం ప్రారంభించాను. వివాహం తర్వాత ఎన్నో విషయాల్లో మార్పు వచ్చింది‘ అని చెప్పారు.

కత్రినా-విక్కీలు 2021డిసెంబర్‌లో ఒక్కటైన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్‌ త్వరలోనే ’బ్యాడ్‌ న్యూజ్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆనంద్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిప్తి డివ్రిూ, అవిూ విర్క్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రానున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ జులై 19న ప్రేక్షకుల ముందుకురానుంది.