టాలీవుడ్ సినిమా దగ్గర ఒక్కో సినిమాకి ఒకో కొత్త లుక్ లో కనిపించడానికి పెట్టింది పేరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఈ స్టైలిష్ స్టార్ ట్యాగ్ నుంచి పూర్తిగా డీ గ్లామర్ చేసేసి చేసిన సినిమా “పుష్ప”. తనతో పాటుగా హీరోయిన్ రష్మికా మందన్నా ని కూడా డీ గ్లామ్ లుక్ లోకి మేకర్స్ మార్చేశారు.
తెలుగు సినిమా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ సినిమాలో షాకింగ్ లుక్ కి తాను మారాడు. దీనితో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఫుల్ గడ్డం రింగుల లాంగ్ హెయిర్ తో ఒక రఫ్ లుక్ లో తాను మారాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు రెండో భాగం “పుష్ప ది రూల్” రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ అయితే అల్లు అర్జున్ ని కొత్త లుక్ లోకి మార్చబోతున్నట్టుగా సినీ వర్గాల్లో కొత్త టాక్ వినిపిస్తుంది. గత సినిమాలో అల్లు అర్జున్ రఫ్ కనిపించగా ఈసారి ఐకాన్ స్టార్ గడ్డం తీసేసి కనిపిస్తాడట.
అంటే పాత లుక్ నుంచి పుష్ప సెటిల్ అవుతాడు కాబట్టి కాస్త కొత్త లుక్ లో తాను మారుతాడట. దీనితో పుష్ప లో కొత్త కోణం కనిపిస్తుంది అట. అందుకే పూర్తి గడ్డం తీసేయకపోయినా ట్రిమ్మింగ్ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. దీనితో అయితే సరికొత్త అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందని చెప్పాలి.