ఇండస్ట్రీ టాక్ : పవర్ స్టార్ “ఖుషి” రీరిలీజ్ కి గట్టి ప్లానే చేసుకున్నారుగా.!

ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద ఎత్తునే రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తుంది. మరి పాత సినిమాలను మళ్ళీ కొత్త ప్రింట్ లా లేటెస్ట్ టెక్నాలజీతో సిద్ధం చేసి రీ రిలీజ్ చేస్తుండగా దీనికి భారీ రెస్పాన్స్ ఇప్పుడు సింగిల్ డే లో వస్తుంది.

అలా ఈ ట్రెండ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు స్టార్ట్ చెయ్యగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని కంటిన్యూ చేసారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అయితే ఓవర్సీస్ లో అయితే మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం “చెన్నకేశవరెడ్డి” భారీ వసూళ్లతో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.

మరి ఇదిలా ఉండగా వచ్చే ఏడాదికి కూడా ఆల్రెడీ అభిమానులు తమ హీరోల సినిమాలు ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని పవన్ ఫ్యాన్స్ నిజానికి వచ్చే ఏడాది పవన్ బర్త్ డే కానుకగా ప్లాన్ చేసుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా రీ రిలీజ్ ప్లాన్ మార్చుకున్నారట.

ఈ డిసెంబర్ 31న భారీ రీ రిలీజ్ కి అయితే ఈ సినిమాని ప్లాన్ చేసుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా గ్రాండ్ రిలీజ్ చేసుకోవాలని ఫిక్స్ చేశారట. డిసెంబర్ 31 కి అంటే ఇక ఆ రిలీజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.